*నేటి గదర్ న్యూస్ గుండాల: కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ చేతుల మీదుగా శుక్రవారం గుండాల మండల కేంద్రానికి చెందిన మీసేవ నిర్వాహకుడు ఇర్ఫా కిషోర్ ఉత్తమ మీసేవ నిర్వాహకుడిగా ప్రశంసా పత్రం అందుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆధార్ క్యాంప్ నిర్వహించిన సమయంలో ఉత్తమ సేవలు అందించినందుకు గాను ప్రశంసా పత్రాన్ని ఆయన అందుకున్నారు. మండలంలో మీసేవ సేవలను మరింతగా ప్రజలకు చేరువచేసి నాణ్యమైన సేవలను అందించాలని కలెక్టర్ ఇరప్పా కిషోర్ కు సూచించారు. కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని దీని ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందని కిషోర్ పేర్కొన్నారు
Post Views: 101









