+91 95819 05907

అశ్వారావుపేట మున్సిపల్ ‘రణం’: పీఠం దక్కించుకునేందుకు పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలు!

​అధికార పార్టీలో టిక్కెట్ల లొల్లి.. ఏకమవుతున్న విపక్షాలు: మున్సిపల్ ఎన్నికల్లో మారుతున్న రాజకీయ సమీకరణాలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి, 23: అశ్వారావుపేట మున్సిపాలిటీకి తొలిసారిగా ఎన్నికలు జరుగుతుండటంతో స్థానిక రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మొత్తం 22 వార్డులను కైవసం చేసుకుని తన పట్టు నిరూపించుకోవాలని అధికార కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నప్పటికీ, పార్టీ లోపల నెలకొన్న ‘పాత-కొత్త’ వివాదం తీవ్ర చర్చనీయాంశమైంది. ముఖ్యంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గానికి, పార్టీలోని పాత తరం నాయకులకు మధ్య టిక్కెట్ల కేటాయింపు విషయంలో కోల్డ్ వార్ నడుస్తోంది; కనీసం 11 వార్డులైనా తమకు కేటాయించాలని పాత నేతలు పట్టుబడుతుండగా, మెజారిటీ స్థానాల్లో తమ అనుచరులే ఉండాలని మంత్రి వర్గం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు, అధికార పార్టీలోని ఈ అంతర్గత విభేదాలను ఆసరాగా చేసుకుని బలపడాలని బీఆర్‌ఎస్, బీజేపీ, జనసేన వంటి విపక్షాలు తెర వెనుక పావులు కదుపుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా పొత్తులతో ముందుకెళ్లాలని ఈ పార్టీలు ఆలోచిస్తుండగా, యువత ఓట్లను ఆకర్షించేందుకు తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ వంటి కొత్త శక్తులు కూడా రంగంలోకి దిగుతున్నాయి. అటు కమ్యూనిస్ట్ పార్టీలు (సిపిఐ, సిపిఎం) కూడా తమ ఉనికిని చాటుకునేందుకు సిద్ధమవుతుండటంతో, అశ్వారావుపేట మున్సిపల్ పీఠం ఎవరికి దక్కుతుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. వ్యక్తిగత ప్రతిష్టల కంటే మున్సిపల్ అభివృద్ధి, అధికారమే లక్ష్యంగా సాగుతున్న ఈ ‘వర్గపోరు’లో ఓటరు దేవుడు ఎవరి వైపు నిలుస్తారో వేచి చూడాలి.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !