+91 95819 05907

ఈ నెల 27 నుండి చిరమల్ల జాతర.

*చిరుమల్లలో జాతర కోలాహలం*
*వైభవంగా సమ్మక్క-సారక్కల ఉత్సవాలు*
*చందా వంశీయులతో జాతరకు పూర్తి ఏర్పాట్లు*
*మూడు మండలాల నుంచి తరలిరానున్న భక్తజనం*
నేటి గదర్ కరకగూడెం :
వనదేవతల నామస్మరణతో పల్లెలు పులకరిస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం మండలం, చిరుమల్ల గ్రామంలో సమ్మక్క-సారలమ్మ జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. అడవి తల్లుల ఆగమనంతో చిరుమల్ల గ్రామం జనసంద్రంగా మారనుంది. కరకగూడెం మండలం పరిధిలోని చిరుమల్లలో వెలిసిన సమ్మక్క-సారలమ్మల గద్దెల వద్ద భక్తుల రద్దీ నెలకొంది. మేడారం మహా జాతరను తలపించేలా ఇక్కడ కూడా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గ్రామ ప్రజలు, ఆలయ కమిటీ చందా వంశీయులు ఆధ్వర్యంలో అమ్మవార్ల గద్దెలను సుందరంగా ముస్తాబు చేశారు.
*ఐదు రోజుల పాటు జాతర ఏర్పాట్లు*
ఆదివాసి కోయ గిరిజనుల ఆధ్వర్యంలో ఐదు రోజులపాటు నిర్వహించనున్న మినీ మేడారం జాతర గిరిజనుల్లో సాంప్రదాయ నృత్యాలతో పలుకుతారు. ఈనెల 27 నుంచి ప్రారంభం కానున్న ఈ జాతరకు పెద్ద సంఖ్యలో తరలిరానున్న భక్తజనం. ఈ సందర్భంగా 27వ తేదీన మంగళవారం జాతర ప్రారంభోత్సవంతో దేవతలకు కుంకుమ పూజలు అర్చనలు అభిషేకం చేస్తారు. 28వ తారీఖున బుధవారం ఒక్కపొద్దు ఉండి రాత్రి 10 గంటలకు సారలమ్మను కుంకుమ భరణంతో గద్దెల వద్దకు చేర్చుతారు. 29న గురువారం ముసలమ్మ గుట్ట పెద్దగుట్ట నుండి వన దేవతను ఆదివాసుల సాంప్రదాయాలతో మధ్యాహ్నం ఎదుర్కోలు నిర్వహించి మనదేవతలను జనసంద్రంలో డప్పు వాయిద్యాలతో గిరిజన నృత్యాలతో గుడికి చేర్చి ప్రత్యేక పూజలతో పూజలు చేసి దేవతలను గద్దెలపై కొలువు తీర్చుతారు. ఈ సందర్భంగా ఆరోజున రాత్రి 12 గంటలకు పగిడిద్దరాజు సమ్మక్కలకు కళ్యాణ మహోత్సవం జరుపుతారు. అలాగే 30వ తారీఖున శుక్రవారం శంకు పండగ నాడు భక్తులు తమ ఇలవేల్పులైన సమ్మక్క-సారలమ్మలకు పసుపు కుంకుమలు, చీర సారెలు సమర్పిస్తున్నారు. ముఖ్యంగా భక్తులు తమ కోర్కెలు తీర్చమని అమ్మవార్లకు నిలువెత్తు బంగారం (బెల్లం) నైవేద్యంగా పెడుతారు. డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, బోనాలతో చిరుమల్ల గుట్ట పై మారుమోగనున్నాయి. ప్రతి ఏడాది చుట్టుపక్కల మండలాల, గ్రామాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు. మొత్తానికి చిరుమల్ల గ్రామంలో ఆనాడు పండుగ వాతావరణం నెలకొంటుంది. అమ్మవార్ల చల్లని చూపు తమ గ్రామంపై ఎప్పుడూ ఉండాలని గ్రామస్థులు కోరుకుంటున్నారు.
*జాతరకు అన్ని ఏర్పాట్లు సర్వ సిద్ధం*
-ఆలయ పూజారి చందా రామారావు
సమ్మక్క సారమ్మ అమ్మవారి జాతరకు సర్వ సిద్ధం చేశాం. ఆదివాసుల సంప్రదాయంతో జరుగుతున్నటువంటి సమ్మక్క సారక్క జాతరను మహా జాతర అయినటువంటి మేడారం జాతర జరిగే సంవత్సరంలో ఈ జాతరను కూడా ఆదివాసీ గిరిజన సంప్రదాయంతో చందా వంశీయులు నడుమ భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తాం.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !