*ప్రభుత్వ కార్యాలయాలలో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా*
*నేటి గదర్ న్యూస్ గుండాల*, మండలంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి గుండాల మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ కాసిం మూవెల జెండాను ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు, గుండాల పోలీస్ స్టేషన్ లో ఎస్సై సైదా రహూఫ్ జెండా ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో బాలరాజు జెండాను ఎగరవేశారు. గుండాల గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ కోరం సీతారాములు జెండాను ఎగరవేశారు.గుండాల ప్రగతి విద్యాలయంలో కరస్పాండెంట్ తాటిపల్లి సత్యం జండాను ఎగరవేశారు. అన్ని కార్యాలయాల్లో జాతీయ జెండాను అధికారులు జెండాను ఎగరవేసి గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు
Post Views: 106









