**
*నేటి గదర్ న్యూస్ గుండాల*, ఉత్తమ ప్రతిభకు పురస్కారం అందుకున్న ప్రభుత్వ ఉద్యోగులు గుండాల పోలీస్ స్టేషన్ లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న గ్రామాలపాటి నగేష్ కు ఉత్తమ ప్రతిభ పురస్కారాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రశంసా పత్రాన్ని అందించారు. గుండాల మండల కేంద్రంలో ఉన్న గిరిజన సహకార సంస్థ నిర్వహిస్తున్న పెట్రోల్ బంక్ మేనేజర్ అంబటి శ్రీనివాస్ కు ఐటీడీఏ పీవో రాహుల్ ఉత్తమ ప్రతిభకు పురస్కారాన్ని అందించారు. ఈ ప్రశంసా పత్రం తీసుకోవడం ద్వారా మరింతగా బాధ్యత పెరిగిందని ఉద్యోగంలో మరింత మెరుగైన సేవలను అందిస్తామని వారు పేర్కొన్నారు
Post Views: 57









