+91 95819 05907

రాజ్యాంగ రక్షణ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం గణతంత్రం ను స్పూర్తి గా తీసుకోవాలి ___ డాక్టర్ స్వర్ణకుమారి

రాజ్యాంగ రక్షణ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం గణతంత్రం ను స్పూర్తి గా తీసుకోవాలి
___ డాక్టర్ స్వర్ణకుమారి

నేటి గదర్ న్యూస్,ఖమ్మం జనవరి 26 : నేటి గణతంత్రం దినోత్సవాన్ని స్ఫూర్తి గా తీసుకొని మనం రాజ్యాంగ రక్షణ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉద్యమాలు చేపట్టాలని ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్. స్వర్ణకుమారి పిలుపునిచ్చారు.సోమవారం భారత గణతంత్ర దినోత్సవంను పురస్కరించుకొని వీరనారీమణుల ఆశయ సాధన సమితి జిల్లా కార్యాలయంలో జాతీయ జెండాను డాక్టర్. స్వర్ణకుమారి ఆవిష్కరించి , ప్రసంగించారు. అన్ని వర్గాల అభివృద్ధి ,సంక్షేమాన్ని ఆశించి , ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రూపకల్పన చేశారని , అలాంటి రాజ్యాంగాన్ని నేటి పాలకులు తూట్లు పొడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పాలకులు అవలంబిస్తున్న విధానాల పట్ల బహుజనులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు. వీళ్ళ నుండి మన రాజ్యాంగాన్ని మన ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడంతో పాటు పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. దేశంలో అత్యధిక సంఖ్యాకులైన బహుజనులు పాలకులుగా అవతరించినప్పుడే మన సమస్యలు పరిష్కారం చెందుతాయన్నారు. ఆనాడే గణతంత్ర దినోత్సవ లక్ష్యం నెరవేరుతుందని పేర్కొన్నారు. అప్పుడే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు నిజమైన నివాళి ఇప్పించిన వారవుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరానారి మండల ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షురాలు భూక్య ఉపేంద్ర బాయి , న్యాయ సలహాదారులు షేక్. నజీమా , గౌరవ సలహాదారులు పి. నాగయ్య , ఉపాధ్యక్షురాలు బి.జ్యోతి, జిల్లా ప్రధాన కార్యదర్శి స్పందన , జిల్లా కార్యదర్శి షరీఫా బేగం , సహాయ కార్యదర్శి జాన్ బి, అధికార ప్రతినిధి బి. త్రివేణి , ఆఫీస్ ఇంచార్జి కృష్ణవేణి , బహుజన చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజాసంఘాల ఐక్యవేదిక నాయకులు దాసరి శ్రీనివాస్ , తిరుపతి , పగిడిపల్లి.నాగేశ్వరావు , పమ్మీ రవి, జంకిపల్లి రవి, సర్దార్ డి .నాగేశ్వరావు ,శ్రీనివాసచారి, దారా సంజీవరావు ,సురభి నాయక్ ,వీరన్న నాయక్, రవీందర్ నాయక్ , భవాని ,లక్ష్మీ ,అఖిల్ ,రామకృష్ణ , విజయ , యోనా, లింగయ్య, కవిత, శ్రీదేవి ,లతా, స్వాతి, సంధ్య, రాజేష్, రాంబాబు, నాగేంద్ర ,శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !