+91 95819 05907

అశ్వారావుపేట 3వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్: దగ్గరుండి వేయించిన మాజీ ఎమ్మెల్యే మెచ్చా

అశ్వారావుపేట 3వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్: దగ్గరుండి వేయించిన మాజీ ఎమ్మెల్యే మెచ్చా

​బీఆర్ఎస్, టీడీపీ ఐక్యతతో మున్సిపల్ పీఠంపై ధీమా వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే మెచ్చా

నేటి గద్దర్ న్యూస్,​అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి, 28: అశ్వారావుపేట మున్సిపాలిటీకి తొలిసారి జరుగుతున్న ఎన్నికల వేళ రాజకీయ సందడి పెరిగింది. బుధవారం 3వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థిగా యూఎస్ ప్రకాశ్ రావు తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. అశ్వారావుపేట నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు స్వయంగా దగ్గరుండి అభ్యర్థిచే నామినేషన్ వేయించి, ఎన్నికల బరిలో వెన్నంటి ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మద్దతు తెలపడంతో, ఇరు పార్టీల నాయకులు మరియు కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి అభ్యర్థికి సంఘీభావం ప్రకటించారు. నామినేషన్ అనంతరం జరిగిన ప్రదర్శనలో మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ కేవలం ఈ వార్డులోనే కాకుండా, మున్సిపాలిటీలోని అన్ని వార్డులలోనూ బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందుతారని, అశ్వారావుపేట మున్సిపల్ చైర్ పర్సన్ పీఠాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వార్డు అభివృద్ధిని కాంక్షించే వారంతా ప్రకాశ్ రావును భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ఈ సందర్భంగా ప్రజలను కోరారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !