+91 95819 05907

సొసైటీ కార్యాలయం మూత? యూరియా కొరకు రైతుల అవస్థలు

*గత మూడు రోజులుగా సొసైటీ మూత రైతులకు ఇబ్బందులు*
*పాలకవర్గం లేక ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ఉద్యోగస్తులు*

ప్రైవేట్ షాపులను ఆశ్రయిస్తున్న రైతులు.

నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) జనవరి 29.

మాసాయిపేట మండల కేంద్రంలో రైతులకు ఇబ్బంది కలగకుండా గత ప్రభుత్వం సొసైటీ గోదామును మాసాయిపేట గ్రామంలో నిర్మించి రైతులకు సరిపడా యూరియా నిల్వ చేసుకోవడానికి ఏర్పాటు చేశారు కానీ నాట్లు వేసే సమయంలో గత మూడు నాలుగు రోజులుగా సొసైటీ గోదాం ఉద్యోగస్తులు లేక మూత వేయడంతో చేసేదేం లేక రైతులు ప్రైవేట్ షాపులలో యూరియా దుక్కి మందు కొనుగోలు చేస్తున్నారు. ఒక ఉద్యోగస్తులు లీవ్ లో ఉంటే మరో ఉద్యోగస్తులు పెట్టి నడిపించే సొసైటీ కనీసం ఆ బాధ్యత మరిచి గత మూడు రోజులుగా మూత వేయడం ఎంతవరకు సమంజసం అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసేదేమీ లేక బయట ఫర్టిలైజర్ షాప్ లలో అధిక రేటుకు కొనుగోలు చేయడం జరుగుతుంది. సొసైటీలో దుక్కిమందు యూరియా కొంటే రైతులకు కొంతమేర తక్కువ ధరకు వస్తుందని అదే ప్రైవేట్ షాప్ లలో కొంటే అధిక రేట్లు ఉన్నాయని రైతులు వపోతున్నారు. ఏదేమైనా ఒక సొసైటీ ఆఫీసును గత మూడు రోజులుగా మూసి వేయడం అనేది ఎంత వరకు సమంజసం అని తక్షణమే అధికారులు స్పందించి రైతులకు సొసైటీ గోదామును అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా పై అధికారులను రైతును డిమాండ్ చేశారు. వెల్దుర్తి సీఈఓ అశోక్ ని వివరణ కోరగా మాసాయిపేటలో యూరియా కొరత ఉందని రెండు మూడు రోజుల్లో యూరియా వస్తదని తెలిపారు. ప్రస్తుతానికి పాస్ పెట్ అందుబాటులో ఉందని తెలిపారు. ప్రస్తుతానికి సరిపడా ఉద్యోగస్తులు లేక ఇబ్బందులు ఉన్నాయని సీఈవో అశోక్ తెలిపారు. అందుకే మాసాయిపేటలో వేరే ఉద్యోగస్తుల్ని పంపించలేకపోయామని తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !