+91 95819 05907

కేసీఆర్‌పై కక్షసాధింపు చర్యలు మానుకోవాలి: మందలపల్లి హైవేపై బీఆర్ఎస్ శ్రేణుల గర్జన

​ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ‘సిట్’ నోటీసులు: దొడ్డా రమేష్ ధ్వజం

నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి ) జనవరి, 30: ​తెలంగాణ జాతిపిత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న రాజకీయ కుతంత్రాలను నిరసిస్తూ దమ్మపేట మండల బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మందలపల్లి ఎక్స్ రోడ్డుపై భారీ రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షులు దొడ్డా రమేష్ మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీలు, అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పది నెలలుగా పాలనను గాలికొదిలేసిందని, ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ప్రజల దృష్టి మళ్లించడానికి బీఆర్ఎస్ అధినాయకత్వంపై అక్రమ కేసులు బనాయించడం కాంగ్రెస్‌కు పరిపాటిగా మారిందని మండిపడ్డారు. 14 ఏళ్ల పోరాటంతో తెలంగాణ సాధించి, దశాబ్ద కాలం పాటు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిన కేసీఆర్‌ను ఇబ్బందులకు గురిచేయాలని చూస్తే తెలంగాణ సమాజం ఊరుకోదని, హరీష్ రావు, కేటీఆర్ తర్వాత ఇప్పుడు కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడం వెనుక రాజకీయ కక్ష తప్ప మరేమీ లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ భారీ నిరసన కార్యక్రమంలో వైస్ ఎంపీపీ దారా మల్లిఖార్జునరావు, మాజీ సొసైటీ చైర్మన్ రావు జోగేశ్వరావు, మండల ఉపాధ్యక్షుడు గాజుబోయిన యేసు బాబు, యువజన విభాగ నియోజకవర్గ అధ్యక్షులు యార్లగడ్డ శ్రీనివాసరావు, నాయకపోడు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు రావుల శ్రీనివాసరావు, సర్పంచ్‌లు కొమరం సుశీల, యట్ల రామదాసు, ఉపసర్పంచ్‌లు రామకృష్ణ, మహేష్, మాజీ ఎంపీటీసీ కాసిని శ్రీను, మండల నాయకులు జలగం వాసు, దేవరపల్లి అజయ్, అల్ల జంగం, తుమ్మల లక్ష్మణరావు, చీకటి రామయ్య, అడపా కృష్ణయ్య, సోయం రాజబాబు, అబ్దుల్ జిన్న, పాస్యం ప్రసాద్, కోర్స వెంకటేశ్వరావు, ఎస్సీ సెల్ నాయకులు మద్దెల పుల్లారావు, కార్మిక సంఘం నాయకులు గాజుబోయిన శ్రీనివాసరావు, కొలికపోగు ధర్మ, వార్డు సభ్యులు ఉయ్యాల వెంకటేశ్వరావు, సున్నం నరేంద్ర, వల్లెపు నాగేశ్వరావు, మడిపల్లి పోలయ్య తదితరులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !