+91 95819 05907

రేవంత్ సర్కార్‌పై దమ్మపేటలో ‘గులాబీ’ గర్జన: కేసీఆర్ జోలికొస్తే ఖబడ్డార్!

రేవంత్ సర్కార్‌పై దమ్మపేటలో ‘గులాబీ’ గర్జన: కేసీఆర్ జోలికొస్తే ఖబడ్డార్!

​నియోజకవర్గ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ.. హోరెత్తిన నినాదాలు

నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి) ఫిబ్రవరి, 01: ​తెలంగాణ జాతిపిత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై ఫోన్ ట్యాపింగ్ నెపంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న రాజకీయ కుట్రలను నిరసిస్తూ దమ్మపేట మండల కేంద్రం గులాబీమయమైంది. బీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు దొడ్డా రమేష్ ఆధ్వర్యంలో దమ్మపేట నుంచి మందలపల్లి వరకు నిర్వహించిన భారీ బైక్ ర్యాలీలో అశ్వారావుపేట నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పాల్గొని నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు; ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల వేళ తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై అక్రమ కేసులు బనాయిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. ఈ ఆందోళనలో వైస్ ఎంపీపీ దారా మల్లిఖార్జునరావు, మాజీ చైర్మన్ రావు జోగేశ్వరరావు, సోయం వీరభద్రం, గాజుబోయిన యేసు బాబు, యార్లగడ్డ శ్రీనివాసరావు, రావుల శ్రీనివాసరావుతో పాటు సర్పంచ్‌లు కొమరం సుశీల, యట్ల రామదాసు, నేతలు జలగం వాసు, తుమ్మల లక్ష్మణరావు, సోయం రాజబాబు, కాసిని శ్రీను, మద్దెల పుల్లారావు మరియు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని “సీఎం రేవంత్ డౌన్ డౌన్” అంటూ నినదించారు. తెలంగాణ కోసం పోరాడిన నాయకుడిపై కక్షసాధింపు చర్యలు మానుకొని ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, లేనిపక్షంలో ప్రజా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని బీఆర్‌ఎస్ శ్రేణులు హెచ్చరించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !