అశ్వారావుపేటలో ‘కారు’ జోరు -గడపగడపకూ బీఆర్‌ఎస్ ప్రచారం
మున్సిపల్ పీఠమే లక్ష్యం.. అభ్యర్థుల గెలుపు కోసం క్షేత్రస్థాయిలో విస్తృత పర్యటన
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) ఫిబ్రవరి, 01: అశ్వారావుపేట మున్సిపాలిటీ ఎన్నికల వేళ రాజకీయ సందడి ముమ్మరమైంది, బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిని శ్రీమతి కాసాని నాగ శేష పద్మ ఆధ్వర్యంలో పట్టణంలో ప్రచారం హోరెత్తుతోంది. బీఆర్‌ఎస్ మరియు తెలుగుదేశం పార్టీలు ఉమ్మడిగా బలపరిచిన 18వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి శెట్టిపల్లి రఘురాం, 7వ వార్డు అభ్యర్థి కొల్లి రవి కిరణ్‌లతో కలిసి ఆమె ప్రతి ఇంటికీ వెళ్తూ ‘కారు’ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. పట్టణాభివృద్ధి కేవలం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్‌ఎస్ వల్లే సాధ్యమని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే తమ అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరుతూ సాగుతున్న ఈ ప్రచారంలో మాజీ జెడ్పీటీసీలు జూపల్లి రమణారావు, సున్నం నాగమణి, మాజీ ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి, నేతలు కాసాని చంద్రమోహన్, వగ్గెల పూజ, సంపూర్ణతో పాటు బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు, యువజన విభాగం అధ్యక్షుడు మోహన్ మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.









