ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయండి.
*4 లేబర్ కోడ్ లు రద్దు చేయాలి*
*ఉపాధి హామీ, విద్యుత్,విత్తన చట్టాన్ని పరిరక్షించాలి*
నేటి గదర్ కరకగూడెం: దేశంలో లేబర్ కోడ్ లు అమలు కార్మిక హక్కులకు మరణ శాసనం లాంటివాని, వాటిని ప్రతిఘటించాలని సిఐటియు మండల కన్వీనర్ కొమరం కాంతారావు పిలుపునిచ్చారు.దీనిలో భాగంగా ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని అంగన్ వాడి సుపర్ వైజర్ రాజమణికి సమ్మె వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేశారు.పలు రంగాల్లో సమ్మెకు సంబంధించిన నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ కార్మికుల శ్రమను తీవ్రస్థాయిలో దోపిడీ చేయడం, సంపద మొత్తాన్ని కార్పోరేట్ శక్తులకు దోచిపెట్టడం, నయా బానిస వ్యవస్థను తయారు చేయడం లక్ష్యంగా లేబర్ కోడ్లు రూపొందించబడ్డాయని విమర్శించారు. వందల సంవత్సరాల పోరాటాల ఫలితంగా కార్మిక హక్కులు సాధించుకున్నామని వాటిని మోదీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం, పెట్టుబడిదారులు, కార్పొరేట్ల ప్రయోజనాల కోసం రద్దు చేస్తున్నాయని అన్నారు. సంపద సృష్టిలో పౌర సేవలు సృష్టిలో కార్మికులు రైతులు వ్యవసాయ కార్మికులే కీలకపాత్ర పోషిస్తున్నారని అటువంటి సంపద సృష్టికర్తల హక్కుల పైన ఏకపక్షమైన దాడి కేంద్ర బిజెపి ప్రభుత్వం చేస్తుందని , ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేలా చేస్తుందని నూతన విద్యుత్ చట్టం విత్తన చట్టం బడా కార్పొరేట్ పెట్టుబడిదారుల కోసమే చట్టాలను నీరుగారుస్తుందని అయన ఆవేదన వ్యక్తం చేశారు.అలాగే ఫిబ్రవరి 12 వ తేదిన ఒకరోజు సమ్మె తోటి కేంద్ర ప్రభుత్వం వైఖరిలో మార్పు రాకపోతే బహుళ రోజుల సమ్మెలకు కార్మిక వర్గాన్ని సమాయత్వం చేస్తామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అంగన్వాడి, మధ్యాహ్న భోజనం, గ్రామపంచాయతీ రంగాల కార్మికులు నాయకులు టిచ్చర్లు సావిత్రి,సునీత, శిరీష సూజత, తదితరులు పాల్గొన్నారు.









