**
తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలోని ద్వారపూడి గ్రామంలో గురువారం రాత్రి అత్యంత కిరాతకమైన సంఘటన చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నారన్న కోపంతో ఒక యువకుడిని అమ్మాయి తరపు బంధువులు రాళ్లతో కొట్టి చంపడం స్థానికంగా కలకలం రేపింది.వివరాల్లోకి వెళ్తే.. ద్వారపూడికి చెందిన పోలిపల్లి సూర్యప్రకాశ్ (41), రాయవరంలో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్న ఆయనవిల్లి సంధ్య (40) గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ బుధవారం అన్నవరం దేవస్థానంలో వివాహం చేసుకున్నారు. అయితే వీరి పెళ్లి సూర్యప్రకాశ్ కుటుంబానికి ఇష్టమున్నా, సంధ్య కుటుంబ సభ్యులు మాత్రం తీవ్రంగా వ్యతిరేకించారు.పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చిన కొత్త జంటపై సంధ్య తరపు బంధువులు పగ పెంచుకున్నారు. రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో పెళ్లికొడుకు సూర్యప్రకాశ్ ఇంటికి వెళ్లిన యువతి కుటుంబ సభ్యులు, ఒక్కసారిగా దాడికి దిగారు. రాళ్లతో అతి కిరాతకంగా కొట్టడంతో సూర్యప్రకాశ్ తీవ్ర గాయాలకు గురై అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న వెంటనే మండపేట రూరల్ ఎస్సై వి. కిషోర్, సీఐ పి. దొరరాజు








