ఘనంగా ఉపవాస కూడికలు.
నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి :
వైరా మున్సిపాలిటీ పరిధిలోని మొదటి వార్డ్ ఆర్.సి.యం చర్చి ప్రాంగణంలో ఆర్.సి.యం వన్ మరియు సెయింట్ జోసెఫ్ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో.. ప్రతి సంవత్సరం ఉపవాస కూడికలను ఘనంగా నిర్వహించారు.. ఈ సందర్భంగా ఈ కూడికకు ముఖ్య అతిథులుగా రెవ. ఫా గోరంట్ల చార్లెస్, రెవ. ఫా. కిన్నర రమేష్, రెవ. ఫా.అమర్లపూడి వినోద్ రెవ.ఫా. మాధానురాజు, హాజరై సంఘ సభ్యులకు తపస్సు కాలం గురించి భక్తులకు వివరించారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ… ఈ కూడికలో ఏసుక్రీస్తు గారిని ఆదర్శంగా తీసుకుంటూ వారు నేర్పిన దయా, ప్రేమ, శాంతి మార్గాల్లో నడుచుకుంటూ. వారు చేసిన 40 రోజులు ఉపవాస దినాలు గుర్తుగా సంఘ సభ్యులు అందరము దీక్ష తీసుకుంటూ.. భక్తిశ్రద్ధలతో ఉపవాస కూడికలను నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో.. యూత్ సభ్యులు,సంఘస్తులు, భక్తులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.








