పదవ తరగతి పరీక్ష రాసే విద్యార్థులకు ఉచిత ఆటో సేవ : సోషల్ వర్కర్ లతీఫ్
నేటి గదర్ న్యూస్, వైరా :
వైరా మండలం , సిరిపురం కేజీ, గ్రామ వాసి సోషల్ వర్కర్ లతీఫ్ గర్భిణీ స్త్రీలకు ఉచిత ఆటో సర్వీస్ అందించడమే కాక తెలంగాణలో ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలకు ఈనెల 14 నుండి వైరా మండలం గరికపాడు , జడ్పీఎస్ఎస్ హై స్కూల్ 10వ తరగతి విద్యార్థులను గరికపాడు హై స్కూల్ నుండి వైరా లోని పరీక్షా కేంద్రం వరకు ఉచితంగా తీసుకువెళ్లి మరల పరీక్షల అనంతరం విద్యార్థులను బాధ్యతగా విద్యార్థులు టైముకు పరీక్ష కేంద్రానికి భయంగాని ఏమాత్రం ఒత్తిడికి గురికాకుండా పరీక్షా కేంద్రానికి చేరవేసి మరల పరీక్ష రాసిన అనంతరం వారి వారి గ్రామాలకు పంపిస్తూ పరీక్ష మొదలైన రోజు నుండి పరీక్షల చివరి రోజు వరకు ఉచితంగా సర్వీస్ అందిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. వైరా మండలం గరికపాడు జడ్పీ ఎస్ ఎస్ హై స్కూల్ 10వ తరగతి విద్యార్థులకు 3 సంవత్సరముల నుండి ఉచిత సేవలు అందిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందని తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
మీ…..సోషల్ వర్కర్ లతీఫ్ సిరిపురం కేజీ గర్భిణీ స్త్రీలకు ఉచితంగా 24 గంటలు ఆటో సర్వీస్ చేయబడును ఫోన్ నెంబర్ 9603747878 కి ఫోన్ చేయగలరు








