+91 95819 05907

ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు తుంగలో తొక్కుతున్న సీఎం

.
*పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం*
*జీతాలు పెంచంటే అరెస్టులు చేస్తారా?*
నేటి గదర్‌ కరకగూడెం: అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు తాము అధికారంలోకి వస్తే వేతనాలు పెంచుతామని 26 వేల రూపాయలు జీతం ఇస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిందని ఇప్పుడు అధికారంలోకి వచ్చే మూడు సంవత్సరాలు కావస్తున్నా జీతాలు పెంచలేదని జీతాలు పెంచాలని అడిగినందుకు, హైదరాబాదులో ధర్నా చేసేందుకు వెళుతున్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లను అక్రమంగా అరెస్టులు చేయటాన్ని హైదరాబాద్ లో ధర్నాలో పాల్గొన్న సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ సహా వందలాది మంది సిఐటియు అంగన్వాడీ టీచర్లు,హెల్పర్లను అరెస్టులు చేయటాన్ని నిరసిస్తూ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు కరకగూడెం మండలం కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియూ మండల కన్వీనర్ కొమరం కాంతారావు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన మాటను తప్పుతుందని విమర్శించారు.ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం ముఖ్యమంత్రి, మంత్రులు మర్చిపోయారా అని ప్రశ్నించారు.ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అంగన్వాడీ టీచర్లకు,హెల్పర్లకు కనీస వేతనం 26,000 ప్రకటించాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాటిటీ చట్టాన్ని అమలు చేయాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న టీచర్, హెల్పర్ పోస్ట్లు భర్తీ చేయాలని అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ కేంద్రాలపై సర్పంచుల పెత్తనాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. అరెస్టు చేసిన అంగన్వాడీ టీచర్లను హెల్పర్లను సిఐటియు నాయకులు విడుదల చేయాలని ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు .విద్యాశాఖ అమలు చేస్తున్న విధంగా అంగన్వాడీ కేంద్రాలకు కూడా ఒక్క పూట స్కూల్ నిర్వహణ మే నెల మొత్తం డిమాండ్ చేశారు. ప్రభుత్వంపోలీసులను ఉపయోగించి అరెస్టులు చేసి నిర్బంధాన్ని ప్రయోగిస్తే అంతకంటే తీవ్రస్థాయిలో పోరాటాలు చేస్తామని హెచ్చరించారు .ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు భవాని, మంగతాయారు, సుజాత, స్వరూప, రమాదేవి, పద్మ, శిరీష, సావిత్రి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

చింతకానిలో ఘనంగా కట్ట మైసమ్మ తల్లి మొక్కులు చెల్లించుకున్న ముదిరాజులు.

చింతకానిలో ఘనంగా కట్ట మైసమ్మ తల్లి మొక్కులు చెల్లించుకున్న ముదిరాజులు. నేటి గదర్ న్యూస్ చింతకాని ప్రతినిధి : ఉమ్మడి ఖమ్మం జిల్లా చింతకాని మండల పరిధిలోని స్థానిక నల్లచెరువుపై కొలువుతీరి ఉన్న కట్టమైసమ్మ

Read More »

తెలంగాణ రాష్ట్రంలో దుబారా మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ

ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. బిజెపి మండల అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి డిమాండ్. నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మార్చి 17. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో బిజెపి

Read More »

మాసాయిపేట రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం

** పాల్గొన్న పలు గ్రామాల రైతులు నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మార్చి 17. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో మంగళవారం నాడు మాసాయిపేటలో గల రైతు వేదిక

Read More »

సర్పంచ్ ల సంఘం నూతన అధ్యక్షులుగా సోలం కేశవరావు.

నేటి గదర్‌ కరకగూడెం: కరకగూడెం మండలం సర్పంచుల సంఘం నూతన అధ్యక్షులుగా వెంకటాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ సోలం కేశవరావు, ఉపాధ్యక్షులుగా కన్నాయిగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ కల్తీ. విజయ్ కుమార్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ

Read More »

విద్యార్థుల అభివృద్ధికి ఆత్మ బలమే ఆలంబన.

*డాక్టర్ ఎస్ సారంగపాణి విశ్రాంత ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్* *డాక్టర్ సారంగాపాని సేవలు అభినందనీయం మండల విద్యాశాఖ అధికారి గడ్డం.మంజుల* *పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్ మరియు షూ పంపిణీ* నేటి గదర్

Read More »

ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు తుంగలో తొక్కుతున్న సీఎం

. *పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం* *జీతాలు పెంచంటే అరెస్టులు చేస్తారా?* నేటి గదర్‌ కరకగూడెం: అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు తాము అధికారంలోకి వస్తే వేతనాలు పెంచుతామని 26 వేల రూపాయలు జీతం ఇస్తామని

Read More »

 Don't Miss this News !