*డాక్టర్ ఎస్ సారంగపాణి విశ్రాంత ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్*
*డాక్టర్ సారంగాపాని సేవలు అభినందనీయం మండల విద్యాశాఖ అధికారి గడ్డం.మంజుల*
*పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్ మరియు షూ పంపిణీ*
నేటి గదర్ కరకగూడెం: మండల పరిధిలోని రేగళ్ల ఎంపిపిఎస్ పాఠశాలలో ఇంచార్జి ప్రధానోపాధ్యాయురాలు టి సుజాత అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆ పాఠశాల 48 మంది విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్ మరియు షూస్, అందజేస్తూ, విద్యార్థులు బాల్యం నుండే, ఆత్మవిశ్వాసాన్ని ఆత్మ బలాన్ని కలిగి ఉండి లక్ష్యం దిశగా ఒత్తిడి లేని సాధన చేయాలని, మహనీయుల జీవితాలు ఎవరివి పూల పాన్పు కాదని, ఇప్పుడున్న సమయంలో చదువుని ఆయుధంగా చేసుకుని ముందుకు సాగాలన్నారు. ఆ దిశగా కృషి చేస్తున్న ఉపాధ్యాయులను అభినందించారు. కరకగూడెం మండల ఎంఈఓ గడ్డం మంజుల మాట్లాడుతూ మంచి ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు డాక్టర్ సారంగపాని క్షేత్రస్థాయిలో విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్ మరియు షూ బహుకరించడం అభినందనీయమని డాక్టర్ సారంగపాణి గారిని ఆదర్శం తీసుకొని ఇంకా దాతలు ముందుకు రావాలని కోరారు. బట్టుపల్లి కాంప్లెక్స్ హెడ్మాస్టర్ టి మోహన్ బాబు మాట్లాడుతూ విద్యార్థి వేసుకునే డ్రెస్ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందని, తన ఆత్మ న్యూనత భావాన్ని పోగొట్టి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందన్నారు.
రేగళ్ల సర్పంచ్ బాడిశ పార్వతి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడం కోసం మా వంతు సహకారాన్ని అందిస్తామని, వారి అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేస్తామన్నారు,జన విజ్ఞాన వెదిక స్టేట్ కల్చరల్ సెక్రటరీ లింగంపల్లి దయానంద్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా గ్రామీణ స్థాయిలో అధికంగా జరగాలని అందుకు సారంగపాణి మార్గదర్శకులుగా ఉంటారన్నారు. యోగా గురువు యోగి రాంబాబు విద్యార్థులకు యోగాలోని వివిధ రకాల ఆసనాలను నేర్పించి, విద్యార్థుల్లో మానసిక,శారీరక వికాసాన్ని పెంపుందేలా వారికి శిక్షణ ఇచ్చారు.
అనంతరం డాక్టర్ సారంగపాణి మాదన్న గూడెం ఆదివాసులను సందర్శించి వారికి పోషక విలువలు లోపించడం వల్ల వచ్చే అనర్ధాలు గూర్చి అవగాహన కల్పించారు. ఇంకా ఈ కార్యక్రమంలో కుమారస్వామి, మల్లేష్, విద్యార్థుల తల్లిదండ్రులు నాగేశ్వరరావు, సూర్యనారాయణ తిరుపతిరావు, వసంతరావు, తదితరులు పాల్గొన్నారు.








