నేటి గదర్ న్యూస్,చర్ల: గత ప్రభుత్వం దళితులకు విడుదల చేసిన దళిత బంధు నిధులను తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయాలని విశ్రాంత ఉపాధ్యాయులుదొడ్డి తాతారావు అన్నారు. చర్ల మండల కేంద్రంలో శుక్రవారం దళిత బంధు లబ్ధిదారులు చేపడుతున్న రిలే నిరాహార దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…గత ప్రభుత్వం
రాష్ట్రం లోని 118 నియోజకవర్గాలలో ఒక్కొక్క నియోజకవర్గానికి 1100 మంది దళితులకు దళిత బంధు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. అధికారులు దళిత బంధు లబ్ధిదారుల జాబితా సైతం ప్రకటించడం జరిగిందన్నారు . ప్రభుత్వం మారడంతో వారి పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైందని ,నేటి ప్రభుత్వం దళిత బంధు నిధులు విడుదల చేసి వారిని ఆదుకోవాలని ఆయన కోరారు.
సమాజంలో దళితులు ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడినవారు భూములు లేక ఉద్యోగాలు లేక కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు దళిత బంధు వస్తుందని తమ జీవితాలు అభివృద్ధి చెందుతాయని ఏన్నో కళలు కన్నారు చిన్న చిన్న రైతులు అప్పులు చేసి వ్యవసాయం చేసారు దానిలో కూడా నష్టపోయరు దళిత బంధు రావడం లేదని కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వెలుబు ఇచ్చారు. దళిత బంధు నిధులు విడుదల చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన అన్నారు.