నేటి గదర్ న్యూస్,మణుగూరు:
గిరిజన విద్యార్థినీ, విద్యార్థులు చదువుతోపాటు గ్రామాలలోని గిరిజన ప్రజలకు సేవా కార్యక్రమాలు చేయడంలో అత్యంత ఉత్సాహం చూపి వారిలో చైతన్య స్ఫూర్తిని నింపి వారి భవిష్యత్తు బంగారు బాటలో పయనించేలా కృషి చేయడం చాలా సంతోషకరమని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ప్రతీక్ జైన్ అన్నారు.శుక్రవారం తన చాంబర్లో డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ, మణుగూరు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి. శ్రీనివాస్ కలిసి జాతీయ సేవా పథకం కార్యక్రమంలో భాగంగా నిర్వహించే ,సేవా కార్యక్రమాలకు సంబంధించి ఆహ్వాన పత్రికను పిఓకి అందజేశారు. అనంతరం పిఓ మాట్లాడుతూ జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) ఆధ్వర్యంలో అశ్వాపురం మండలం గొంది గూడెం గ్రామంలో ఈనెల 12వ తేదీ నుండి 18వ తేదీ వరకు 70 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లతో ఆ గ్రామంలో ఉదయం రోజుకొకటి సేవా కార్యక్రమాలు మరియు సాయంత్రం ఇంటింటికి తిరిగి ప్రజలకు వివిధ స్థితిగతులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వలన ప్రజలలో చైతన్యం వెళ్లి విరుస్తుందని అన్నారు. జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమాలలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లే కాక ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి, మండల స్థాయి అధికారులు గ్రామంలోని ప్రజలు పాల్గొని విద్యార్థులు చేపట్టే కార్యక్రమాలకు తమ వంతు సహాయ సహకారాలు అందించడం చాలా సంతోషమని, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతం అవ్వడానికి ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొని మీరు చేస్తున్న అవగాహన కార్యక్రమాలు ప్రజలకు తమ వంతుగా వారికి తెలియజేయాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారినిమణెమ్మ ,డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.