అత్యంత పారదర్శకంగా సర్వే:సీఎం ఏనుముల రేవంత్ రెడ్డి
* అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రవాణా బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
నేటి గదర్ న్యూస్,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలనే సద్దేశంతో జనాభా గణన- కుల గణన సర్వే నిర్వహించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రకటించారు. తొలుత రాష్ట్ర రవాణా, బీసీ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ కుల గణనకు సంబంధించిన తీర్మానం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి E. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ఈనెల 4న మంత్రివర్గంతో చర్చించి వారందరి ఏకగ్రీవ తీర్మానం మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కుల గణన అత్యంత పారదర్శకంగా నిర్వహించనున్నట్లు తద్వారా సబ్బండవర్గాల ప్రజలకి న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో నిర్వహించిన సమగ్ర సర్వే తో తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏమి లేదని ఆయన ఎద్దేవ చేశారు. దానికి భిన్నంగా రాష్ట్రంలోని అన్ని వర్గాలకు ప్రజలకు న్యాయం జరిగేలా కుల గణన చేపడుతామన్నారు.
