కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించండి
*పాల్గొన్న కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ నాయకులు.
నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
కరకగూడెం మండలంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా అఖిలపక్ష, రాజకీయ ,కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు శుక్రవారం బంద్ పాటించడం జరిగింది. అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. ఆటోలు రోడ్డు ఎక్కలేదు. దీనితో ప్రజలు బాధ అవస్థలు పడ్డారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, సీపీఎం పార్టీ కార్యదర్శి కొమరం కాంతారావు, సిపిఐ పార్టీ కార్యదర్శి వంగరి సతీష్ లు పాల్గో8 మాట్లాడుతూ…
కేంద్ర ప్రభుత్వం రెండవసారి అధికారoలోకి వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక విధానాలను కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూoదని, ఎన్నో పోరాటాల ద్వారా హక్కుల సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు చట్టాలుగా క్రోడి కరించి, కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ. మరల మూడోసారి కూడా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారoలలోకి వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నారని వారు అన్నారు..
కనీస వేతన చట్టం అమలు చేయాలని, ఉపాధిని 200 రోజులకు పెంచి రోజుకు 600 వేతనం పెంచాలని, రైతాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళనలు బిజెపి ప్రభుత్వం బాష్ప వాయు గోళాలు ముల్లకంచెలు వేస్తున్నారని, ప్రజా ఉద్యమాలను పోలీసు బలగాలతో అణచివేయాలని చూస్తున్నారని ఇది సరైన విధానం కాదని దీన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని రైతు పండించే పంటకు కనీస మద్దతు ధర చట్టం చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు, మత కలహాలకు స్వస్తిపలకాలని, అందరికీ ఆమోదయోగ్యమైన పరిపాలన అందించాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో
మండల కాంగ్రెస్,సిపిఎం,సిపిఐ, టిడిపి పార్టీల నాయకులు, కార్యకర్తలు, యువకులు, గ్రామస్తులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
