నేటి గద్దర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: గోదావరి వరద బాధితులకు ఆపద కాలం లో అండగా నిలిచిన వరద బాధితులకు సహాయ సహకారాలు అందించిన పలువురికి భద్రాద్రి జిల్లా కలెక్టర్ ప్రియాంక అల శుక్రవారం కలెక్టరేట్లో సహాయ సేవక్ అవార్డులతో సత్కరించారు .ఈ సందర్భంగా కలెక్టర్ ప్రియాంక అల, IAS మాట్లాడుతూ … 2022-23 గోదావరి వరదల్లో చిక్కుకున్న /నష్టపోయిన బాధితులకు, తమ బాధ్యతగా సేవలందించిన సేవకులకు అభినందనలు తెలిపారు. ప్రజలు కష్టకాలంలో ఉన్నప్పుడు ఇదే స్పూర్తితో ప్రతీ ఒక్కరూ సేవలందించాలని కోరారు. ఒకరికొకరు సహాయపడడం అనేది ఓ మహత్కార్యం అని తెలిపారు… ఈ సంధర్భంగా అవార్డులు పొందిన సేవకులకు , రైతు క్లబ్ చైర్మన్ కొత్తపల్లి ఆంజనేయులు , మీకోసం మేమున్నాం టీం ఛైర్మెన్ లయన్ నీలి ప్రకాష్ లకు మండల ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు..
Post Views: 84









