+91 95819 05907

BCM:CM సార్ ఆ అక్రమ ఇసుక ర్యాంపుపై చర్యలు తీసుకోరా? Cpi ml mass line

★ అక్రమ ఇసుక రవాణా కి అడ్డుకట్ట వేస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి హామీని నిలబెట్టుకోవాలి

★ ముఖ్యమంత్రి హామీకి తూట్లు బోడుస్తున్న స్థానిక అధికారులు

★కాల పరిమితి అయిపోయిన తూరుబాక ఇసుక ర్యాంపులో లూటీ అవుతున్న ప్రజా సంపద…

★ యదేచ్ఛగా సాగుతున్న జీరో బండ్ల దందా

★ అనుమతులను మించి డంపు చేసిన ఇసుక

★అనుమతి లేకుండా అదనపు డంపింగ్ పాయింట్లను ఏర్పాటు చేసిన వైనం

★పట్టించుకోని మండల రెవిన్యూ అధికారులు

★ చోద్యం చూస్తున్నTSMDC, మైనింగ్ అధికారులు

★కలెక్టర్ స్పందించి ప్రజా సంపదను కాపాడాలి

★ రెన్యువల్ లేకుండా నడుపుతున్న తూరుబాక ఇసుక ర్యాంపుని రద్దు చేయాలి

★Cpi ml mass line ప్రజాపందా పార్టీ డివిజన్ కార్యదర్శి కొండా చరణ్

నేటి గద్దర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:

భద్రాచలం పట్టణ కేంద్రంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపందా పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశంలో పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కొండ చరణ్ మాట్లాడుతూ అక్రమ ఇసుక రవాణాన్ని నిలిపివేస్తానని గౌరవ ముఖ్యమంత్రివర్యులు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అన్నారు దుమ్ముగూడెం మండలంలో తూరుబాకలో ఉన్న ర్యాంపులో ప్రజా సంపద అయిన ఇసుక లూటీకి గురవుతుందని ఆరోపించారు ఈ ర్యాంపు పరిమిషన్ అయిపోయి చాలా రోజులు అవుతున్నప్పటికీ ఇప్పుడు కూడా ఇసుక తోలకాలు జరుగుతున్నాయని అన్నారు కాల పరిమితి అయిపోయిన ర్యాంపు ఏ విధంగా కొనసాగుతుందని ప్రశ్నించారు అనుమతికి మించిన ఇసుకను డంపు చేశారని జీరో బండ్ల ద్వారా అక్రమంగా ఆ ఇసుకను తరలిస్తున్నారని అన్నారు డంపు పాయింటు అనుమతి ఒకచోట ఉంటే అదనంగా రెండు చోట్ల డంపింగ్లు పాయింట్లు చేస్తున్నారని అన్నారు ఇంత జరుగుతున్న మండల రెవెన్యూ అధికారులు టిఎస్ఎండిసి మైనింగ్ అధికారులు పట్టించుకోకపోవడం సూచనీయమని అన్నారు మండలంలో చిన్నచితిక ఒకటి రెండు ట్రక్కుల ఇసుక అక్రమంగా స్థూలకాలు జరిపితే స్పందిస్తున్నటువంటి మండల రెవెన్యూ అధికారి లారీలకు లారీల ఇసుక అక్రమంగా తరలి వెళ్తుంటే ఎందుకు పట్టించుకోవడంలేదని విమర్శించారు ఈ ర్యాంపుకు సంబంధించినటువంటి అన్ని అనుమతులు వాటికి సంబంధించినటువంటి వివరాలు బహిర్గత పరచాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా తక్షణం కలెక్టర్ గారు స్పందించి జరుగుతున్న ఈ ప్రజా సంపదలు ఊటీని ఆపాలని కాల పరిమితి అయిపోయిన తూర్బాక ఇసుక ర్యాంపుని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు లేనియెడల కచ్చితంగా పోరాటాల నిర్వహిస్తామని హెచ్చరించారు పార్టీ నాయకులు దాసరి సాయన్న ,మునిగల శివ, బోడా.సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది:మంత్రి పొంగులేటి

TELANGANA CABINET POINTS 1. మన రాష్ట్రంలో సగం జనాభాకు మించి ఉన్న బీసీలకు ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశం మరో శుభవార్తను ప్రకటించింది. స్థానిక

Read More »

BRS: బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేగా ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేగా ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్సీ తాత మధు,మాజీ మంత్రి వనమా వెంకటేశ్వర్లు నేటి గదర్ న్యూస్, కరకగూడెం:బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ

Read More »

Guru Powrnami: సీనియర్ ఉపాధ్యాయురాలికి ఘన సన్మానం

— అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన మార్గంలో నడిపించేది గురువులు — మణుగూరు ఎస్బిఐ బ్రాంచ్ సీనియర్ హెడ్ మెసెంజర్ గీదె మోహన్ రావు ౼ మండల వ్యాప్తంగా ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు నేటి

Read More »

జులై 14 న జవహర్ నవోదయ విద్యాలయం ప్రారంభం‌‌‌‌‌‌‌‌

*జవహర్ నవోదయ విద్యాలయ ఏర్పాట్లను పరిశీలించిన విద్యాశాఖాధికారి ఎం వెంకటేశ్వర చారి* నేటి గదర్‌ కరకగూడెం: ఈనెల 14వ తేదీన ప్రారంభం ప్రారంభించనున్న జవహర్ నవోదయ పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటేశ్వర

Read More »

తెలంగాణ రైతులు యూరియా వాడకం తగ్గించుకోవాలి :కేంద్ర మంత్రి జేపీ నడ్డా

నేటి గదర్ న్యూస్,వెబ్ డెస్క్: తెలంగాణలో నిజమైన అవసరాలుంటేనే సహాయం చేస్తాము యూరియా కొరతపై రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేసిన బీజేపీ కేంద్ర మంత్రి జేపీ నడ్డా రాష్ట్రంలో యూరియా కొరతను నిర్మూలించాలని, సరిపడా

Read More »

కార్మికులను బానిసలుగా మార్చుతున్న కేంద్ర ప్రభుత్వం.

వైరా పట్టణంలో కదం తొక్కిన కార్మిక లోకం కార్మిక, కర్షక ఐక్యతతో ఉద్యమాలు కొనసాగిస్తాం అఖిలపక్ష ప్రజా సంఘాల నాయకులు నేటి గదర్ న్యూస్, వైరా:- దేశవ్యాప్తంగా జరిగిన సమ్మెలో భాగంగా సిఐటియూ, టియుసిఐ,

Read More »

 Don't Miss this News !