ఎంబీఏ విద్యార్థిని మృతి
వేధింపులే కారణమనీ కుటుంబ సభ్యులు రాస్తారోకో
సాహితి మృతికి కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్
వెంకటాపురం అధికార పార్టీ బడా బాబు కొడుకుగా గుర్తింపు
నేటి గద్దర్ న్యూస్ ,నూగుర్ వెంకటాపురం:
ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ఆలుబాకా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి హైదరాబాదులోని ఎంబీఏ చదువుతున్న విద్యార్థిని దిల్సుఖ్నగర్ ప్రైవేట్ హాస్టల్లో సాహితీ ఉరి వేసుకొని మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం
ములుగు జిల్లా వెంకటాపురం గ్రామానికి చెందిన చిడం హరీష్ అనే వ్యక్తి సాహితిని మానసికంగా వేధించి ఆత్మహత్య చేసుకోవడానికి కారకుడు అయ్యాడు చిడం హరీష్ తండ్రి అధికార పార్టీ సీనియర్ నాయకుదిగా PACS చైర్మన్ గా కొనసాగుతున్నాడనీ అధికార పార్టీ బలం తో కుటుంబ సభ్యులతో మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని బెదిరించారని సాహితీ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు సాహితి మృతిపై ఆలుబాక ప్రధాన రహదారిపై మృతదేహంతో రాస్తారోకో నిర్వహించారు. మృతికి కారకులైన చిడెం హరీష్ మోహన్ రావు లను వెంటనే శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.