*BRS తీర్థం పుచుకొనున్నారా?
*నంది నగర్ లో మాజీ CM కేసీఆర్ తో RS భేటీ
నేటి గద్దర్ న్యూస్ వెబ్ డెస్క్:BSP కి తెలంగాణ చీఫ్ డా.RS ప్రవీణ్ రాజీనామా చేసినట్లు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్(X) వేదికగా శనివారం ప్రకటించారు.BRS – BSP పొత్తుని జీర్ణించుకోలేని BJP ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ అక్రమంగా ఎమ్మెల్సీ కవితని అరెస్టు చేసినట్లు ఆయన ధ్వజమెత్తారు. తమ పొత్తును భగ్నం చేయాలని పిఎం చూస్తున్నారని ఆరోపించారు. బహుజన విలువలకు కట్టుబడి తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కాగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నంది నగర్ లో మాజీ CM కేసీఆర్ తో భేటీ అయినట్లు సమాచారం. మరి కొద్ది సేపట్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.
Post Views: 143