★నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన
నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం:
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టుపై బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు కన్నెర్ర జేశారు. అరెస్టుకు నిరసనగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా BRS పార్టీ శ్రేణులు ఆందోళనలు నిర్వహించారు. బస్సు డిపోల ముందు బీఆర్‌ఎస్ కార్యకర్తలు బైఠాయించారు. మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వెయ్యి మంది మోదీలు, రేవంత్‌లు వచ్చినా భయపడేది లేదని స్పష్టం చేశారు. ఎలాంటి మచ్చలేకుండా ఎమ్మెల్సీ కవిత బయటకు వస్తారని నమ్మకం వ్యక్తంచేశారు.ఈ కార్యక్రమంలో మణుగూరు మండల BRS నాయకులుయాదగిరి గౌడ్,కో ఆప్షన్ సభ్యులు పాషా, ముద్దగుల కృష్ణ, వల్లభనేని రమణ, తా తా రమణ, అవుల నర్సింహ రావు, ఎనిక ప్రసాద్, యూత్ హర్ష,సృజన్, పవన్ నాయక్,చైతన్య, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 105