బోనకల్ లో ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
– బోనకల్ మండలంలో 69.55శాతం పోలింగ్
నేటి గదర్ న్యూస్, మే 27, బోనకల్ / ఖమ్మం జిల్లా ప్రతినిధి :
ఖమ్మం – నల్గొండ- వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సోమవారం బోనకల్ మండలంలో ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికల్లో బోనకల్ మండలంలో 1971 మంది ఓటర్లు ఉండగా 1371 మంది ఓటర్లు వినియోగించుకున్నారు. వీరిలో పురుషులు 681మంది మహిళలు 490 మంది ఓట్లు వేశారు. మండలంలో 69.55 శాతం పోలింగ్ నమోదయింది. పట్టభద్రులు ఉదయం 9 గంటల నుండి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జంబో బ్యాలెట్ పేపర్ కావడంతో పాటు ప్రాధాన్యత క్రమంలో ఓటు వేసే నెంబర్లు ఎక్కువగా ఉండడంతో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎక్కువ సమయం పట్టింది. రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు ఈ ఎన్నికల్లో ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తహశీల్దార్ అనిశెట్టి పున్నం చందర్, ఎంపిడిఓ ఎల్ రాజు, గిర్ధావర్ గుగులోతు లక్ష్మణ్ లు క్షేత్రస్తాయి సిబ్బందితో కలిసి మౌలిక సదుపాయాలు కల్పించారు. ఈ ఉపఎన్నిక సరళిని మధిర సిఐ డి మధు, స్థానిక ఎస్సై మధుబాబుతో కలిసి పరిశీలించారు. ఎటువంటి అవాంఛ నీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.