నేటి గదర్ న్యూస్, మే 27, బోనకల్ / ఖమ్మం జిల్లా ప్రతినిధి :
సోమవారం జరిగిన ఖమ్మం నల్లగొండ వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వామపక్షాలు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నదే విజయమని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తోట రామాంజనేయులు అన్నారు. బోనకల్ మండల కేంద్రంలో పిసిసి సభ్యులు పైడిపల్లి కిషోర్ కుమార్, సిపిఎం నాయకులు బంధం శ్రీనివాస్ రావు లలో కలసి ఆయన ఓటింగ్ సరళని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బోనకల్ మండలంలో 1971 పైచిలుకు ఓట్లు ఉండగా సుమారు 1371 ఓట్లు పోలైనట్లు పేర్కొన్నారు. పోలైన ఓట్లలో 50 శాతానికి పైగా తీన్మార్ మల్లన్నకు పడే అవకాశం ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా వామపక్షాలు బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థికే ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉందని తద్వారా ఎన్నికలలో తీన్మార్ మల్లన్న గెలుపు ఖాయం అన్నారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డిని ప్రజల గెలిపించినప్పటికీ తన స్వార్థం కోసం రాజీనామా చేసి ఉపఎన్నికకు కారణమయ్యాడన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులను మోసం చేసిన కెసిఆర్ బారాసాను కూడా గెలిపించే పరిస్థితి లేదన్నారు. వామపక్షాలు బలపరిచిన అభ్యర్థి వైపే నిరుద్యోగులు, మేధావులు, పట్టభద్రులు చూస్తున్నట్లుఉంటుంది కనిపించిందన్నారు. కనుక తీన్మార్ మల్లన్నకు ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ బోనకల్ మండల కార్యదర్శి యంగల ఆనందరావు, సిపిఎం మండల నాయకులు గుగులోతు పంతు, తెల్లాకుల శ్రీను, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గాలి దుర్గారావు ,కలకోట సొసైటీ చైర్మన్ కర్నాటి రామాకోటేశ్వరావు,వైస్ ఎంపీపీ గుగులోతు రమేష్ కాంగ్రెస్ నాయకులు ,తమ్మారపు వెంకటేశ్వర్లు, పాసంగులపాటి కోటేశ్వరరావు, చిలక వెంకటేశ్వర్లు, సుబ్బారావు, పల్లిపాటి తిరుపతిరావు, తమ్మారపు బ్రహ్మయ్య , సిపిఐ మండల సహాయ కార్యదర్శిలు జక్కుల రామారావు, ఆకేన పవన్, యూత్ కాంగ్రెస్ నాయకులు భూక్య భద్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు.