నేటి గద్దర్ వాజేడు
వర్షాకాలం పరిస్థితులపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర నరసింహారావు రాష్ట్ర DM & HO టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాబోయే వరదల ప్రభావం ఉన్న గోదావరి పరివాహక ప్రాంతాలలో ప్రధానంగా ప్రజల ఆరోగ్యాల పై దృష్టి పెట్టాలని, వైద్యంతో పాటు ఇతర సమస్యలు కరెంటు, త్రాగునీరు, దోమలు ఈగలు వంటి సమస్యలతో వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ నేపథ్యంలో
వాజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను డి ఎం హెచ్ అప్పయ్య ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. రానున్న రైన్ సీజన్లో వ్యాధులు ప్రబలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇన్వైటర్ రిపేర్ చేయించమని మెడికల్ ఆఫీసర్ కి సూచించడం జరిగింది. పిహెచ్సిలకు పవర్ బ్యాంక్ సౌకర్యాలు అమలు చేసే విధంగా కృషి చేస్తానని డిఎంహెచ్ఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మహేందర్ ,జూనియర్ అసిస్టెంట్ సుధాకర్, ఫార్మసిస్ట్ స్టాఫ్ నర్స్ తదితరులు పాల్గొన్నారు.