నేటి గదర్,మే 27 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి):
ఖమ్మం – నల్లగొండ – వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కూసుమంచి మండలంలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.. పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారి సంఖ్యలో తరలివచ్చారు.. గంటల తరబడి క్యూ లైన్లో నిలబడి తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు.. మహిళా పట్టభద్రులు 681 మంది (68.37 శాతం) ,పురుషుల పట్టభద్రులు 1460 (71.56 శాతం) మంది తమ ఓటును వినియోగించుకున్నారు.. సాయంత్రం 4గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి మొత్తం 2141 ( 70.52 శాతం) పోలింగ్ నమోదైనట్టుగా అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. పోలింగ్ సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు.
Post Views: 131