+91 95819 05907

ఫుడ్ సెక్యూరిటీ అధికారుల రైడ్స్

కల్తీ కల్తీపై కొరడా చూపించిన ఫుడ్ సెక్యూరిటీ అధికారులు
– భద్రాచలంలో ఫుడ్ సేఫ్టీ స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన అధికారులు
– పాడైపోయిన ఆహార పదార్థాలను ధ్వంసం చేసిన అధికారులు
– నిబంధనలను పాటించని హోటళ్లకు నోటీసులు, జరిమానా
– లాభార్జన కోసం కల్తీకి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం ఫుడ్ సెక్యూరిటీ స్పెషల్ డ్రైవ్ జోనల్ అధికారిని జ్యోతిర్మయి

నేటి గదర్, మే 27, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి :

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాల ప్రకారం ఫుడ్ సేఫ్టీ స్పెషల్ డ్రైవ్ ను అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని శ్రీ భద్ర గ్రాండ్ హోటల్, శ్రీ గౌతమి స్పైస్ హోటల్ , శ్రీ రాఘవేంద్ర టిఫిన్ అండ్ మీల్స్ హోటల్ పై ఫుడ్ సేఫ్టీ బృందాలు జోనల్ అధికారిణి వి.జ్యోతిర్మయి ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కాగా శ్రీ భద్ర హోటల్ లో రిఫ్రిజిరేటర్ లో ఉంచిన 88 లీటర్ల ఐస్ క్రీం ఫంగస్, పురుగులతో దుర్వాసన రావడంతో జోనల్ ఫుడ్ సేఫ్టీ అధికారిణి జ్యోతిర్మయి హోటల్ యాజమాన్యం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటికప్పుడే ప్రజల ఆరోగ్యానికి భంగం కలవకూడదని 36 వేల విలువచేసే బూజు, పురుగులు పట్టిన ఐస్ క్రీమ్ ని ధ్వంసం చేసి సదరు హోటల్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. క్యాన్సర్ కారకాలైన కృత్రిమ హానికరమైన రంగులను బిర్యానీ, తదితర ఆహార పదార్థాలలో కలిపి, అపరిశుభ్ర వాతావరణంలో ఆహారం తయారు చేసి, అమ్మకాలు నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న సదరు హోటల్ యాజమాన్యంకు FSSA చట్టానికి సంబంధించిన నోటీసులను జారీ చేసి, సుమారు 10 కేజీల రంగు కలిపిన బిర్యానిని ధ్వంసం చేసి, గ్రామపంచాయతీ అధికారుల చేత పదివేల రూపాయల జరిమానా విధించి రెక్టిఫికేషన్ కోసం హోటల్ మూసి వేయాలని ఆదేశించారు. హోటల్ గౌతమి స్పైసెస్ వద్ద మొత్తం దుమ్ము ధూళితో, ఈగలు, పురుగులతో ఉన్న అపరిశుభ్ర వాతావరణంలో ఆహారం తయారు చేస్తూ, హానికరమైన రంగులను ఆహార పదార్థాలు వినియోగిస్తున్నందున, పెస్ట్ కంట్రోల్ చేయకుండా, ఆహార పదార్థాలు తయారు చేస్తున్న చోట డ్రైనేజ్ వాటర్, చెత్త, ఈగలు ఉండడంతో నిలువ చేసిన ఆహార పదార్థాలు రిఫ్రిజిరేటలో గమనించడంతో అవన్నీ ధ్వంసం చేసి ఆ యాజమాన్యానికి FSSA చట్టపరమైన నోటీసులు జారీ చేసి, గ్రామపంచాయతీ భద్రాచలం వారిచే 25 వేల రూపాయల జరిమానా విధించి నిర్ణీత గడువులో రెక్టిఫై చేయించుకోకపోతే హోటల్ శాశ్వతంగా సీజ్ చేస్తామని హెచ్చరించడం జరిగింది. రాఘవేంద్ర టిఫిన్స్ అండ్ మీల్స్ హోటల్లో అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలు తయారు చేస్తూ, పాలలో, ఇడ్లీ పిండిలో చచ్చిపోయిన ఈగలు, వండిన వంకాయ టమాట కూరలో బిల్డింగ్ కప్పు నుండి బూజు, మట్టి వ్యర్థ పదార్థాలు రాలి పడినప్పటికీ ప్రజలకు అమ్ముతున్నందున, లైసెన్స్ డిస్ప్లే చేయకుండా ఉండడం వల్ల, సబ్బులు డిటర్జెంట్స్, కెమికల్స్ ఉండే ప్రదేశంలో పల్లీలు, ఇడ్లీ పచ్చడి లాంటివి పెట్టి కల్తీ కి పాల్పడుతుండడం వలన వాళ్లకు మూడు రకాల నోటీసులు జారీ చేసి, 5,000/- రూపాయల పెనాల్టీ విధించడం విధించారు. అనంతరం ఫుడ్ సెక్యూరిటీ అధికారులు మాట్లాడుతూ… ప్రజలకు అమ్మే ఆహారం సుచిగా, శుభ్రంగా, సురక్షితంగా ఉండాలని, లాభార్జన కోసం, ధనార్జన కోసం ఎటువంటి కల్తీలకు పాల్పడి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే క్రిమినల్ కేసులు అవసరమైతే కేసు తీవ్రతను బట్టి జైలుకు పంపించడం జరుగుతుంది అని స్పెషల్ డ్రైవ్ జోనల్ అధికారిని జ్యోతిర్మయి తెలిపారు. ఈ స్పెషల్ డ్రైవ్ దాడులలో భద్రాద్రి కొత్తగూడెం ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆర్.కిరణ్ కుమార్, యాదాద్రి, నల్గొండ ఫుడ్ ఇన్స్పెక్టర్ పి.స్వాతి, వనపర్తి, గద్వాల్ ఫుడ్ ఇన్స్పెక్టర్ నీలిమ, భద్రాచలం గ్రామపంచాయతీ బిల్ కలెక్టర్ కృష్ణ అర్జున్ రావు, తదితర సిబ్బంది పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !