నేటి గదర్, మే 27, బూర్గంపాడు / భద్రాద్రి కొత్తగూడెం :
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం చెందిన సంఘటన సోమవారం సాయంత్రం మొరంపల్లి బంజర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి… అశ్వాపురం మండలంలోని పాములపల్లి గ్రామానికి చెందిన కుంజా రాజశేఖర్(32) ద్విచక్ర వాహనంపై వస్తున్న క్రమంలో మోరంపల్లి బంజర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపం లోని అదుపు తప్పి డివైడర్ ని ఢీ కొట్టడంతో కింద పడిపోయాడు. ఈ క్రమంలో మణుగూరు నుంచి పాల్వంచ వెళ్తున్న ఇసుక లారీ టిఎస్ 29 టి 3789 లారీ అతనిపై నుంచి లారి టైర్లు ఎక్కి దూసుకుకోవడంతో రాజశేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి హుటా హుటిన చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బూర్గంపాడు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాదానికి గురైన ద్విచక్ర వాహనం, లారీని పోలీస్ స్టేషన్ తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.