నేటి గద్దర్ కరకగూడెం:
తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు సిరి శెట్టి కమలాకర్ ఆధ్వర్యంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కరకగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు పాలు పండ్లు అందజేసి కేక్ కటింగ్ చేయించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు 1982 మార్చి 29న తెలుగుదేశం పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించారని ఆయన అన్నారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఏడు సంవత్సరాల పాటు పనిచేసిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. రాజకీయ రంగాలలో కాకుండా సినీ పరిశ్రమలలో సినిమా నటుడు, దర్శకుడు,ఎడిటర్ గా పనిచేశారని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు పాయం లక్ష్మీనారాయణ చందా రాఘవులు మహబూబాబాద్ పార్లమెంట్ ఎస్టీ సెల్ నాయకులు ఈసం సత్యనారాయణ,నాయకులు అవుదోడ్డి శ్రీనివాస్, గుండ్ల.కళ్యాణ్,సావిత్రి, సారమ్మ తదితరులు పాల్గొన్నారు.