క్రమశిక్షణతో అధికారులు,సిబ్బంది ఈ శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలి…
కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిక్షణా తరగతులను ప్రారంభించిన…
జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపిఎస్.
నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి భద్రాద్రి కొత్తగూడెం మే 28:
కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొస్తున్న మూడు కొత్త క్రిమినల్ చట్టాలపై జిల్లా పోలీస్ యంత్రాంగానికి శిక్షణా తరగతులు ప్రారంభించినట్లుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపిఎస్ పేర్కొన్నారు.
దేశంలో నేర,న్యాయ వ్యవస్థలో పూర్తిగా మార్పులు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకోనున్న చర్యలలో భాగంగా కొత్తగా రూపొందించబడిన మూడు చట్టాలు భారతీయ న్యాయ సంహిత,భారతీయ నాగరిక్ సురక్ష సంహిత మరియు భారతీయ సాక్ష్యా అధినియం-2023.ఈ మూడు చట్టాలు రానున్న జూలై 1,2024 నుండి అమలులోకి రానున్నాయి.అందువలన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఉన్న పోలీసు అధికారులు,సిబ్బందికి కొత్త చట్టాలపై అవగాహన కల్పించేందుకు శిక్షణా తరగతులను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.ఇందులో భాగంగా ఈ రోజు కొత్తగూడెం సబ్ డివిజన్లోని పోలీసు అధికారులు మరియు సిబ్బంది కొరకు కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్ ఆధ్వర్యంలో సింగరేణి ఉమెన్స్ కళాశాల నందు ఏర్పాటు చేసిన శిక్షణా తరగతులను జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపిఎస్ ప్రారంభించారు.ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ,హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం,ఈ మూడు చట్టాలు భారత శిక్షా స్మృతి (IPC)-1860,క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC)-1973,మరియు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్-1872 లను రీప్లేస్ చేయనున్నాయని అన్నారు.ఈ మూడు కొత్త క్రిమినల్ చట్టాలలో సమకాలీన కాలం మరియు వాడుకలో ఉన్న సాంకేతికతలకు అనుగుణంగా అనేక కొత్త నిబంధనలు చేర్చడం జరిగిందని తెలిపారు.
ఈ మూడు కొత్త చట్టాలు నేరస్థులకు శిక్ష పడేవిదంగా చేయడం,బాధితులకు న్యాయం అందించడం పైన ఎక్కువ దృష్టి సారిస్తాయని తెలిపారు.సత్వర న్యాయం అందించడం, న్యాయ వ్యవస్థ మరియు న్యాయస్థాన నిర్వహణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం ద్వారా భాధితులకు న్యాయం అందించడం పై కేంద్రీకృతం చేయబడ్డాయని తెలిపారు.ఈ మూడు కొత్త చట్టాలకు డిసెంబర్ 21,2023న పార్లమెంట్ ఆమోదం లభించిందని తెలియజేసారు.అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డిసెంబర్ 25,2023న సమ్మతిని ఇవ్వడం జరిగిందన్నారు.బాధితుల హక్కులను పరిరక్షించడం,నేరాల విచారణ మరియు విచారణను సమర్ధవంతంగా నిర్వహించడానికి అనుగుణంగా కొత్త క్రిమినల్ చట్టాలకు చాలా అవసరమైన మెరుగులు దిద్దడం జరిగిందని అన్నారు.క్రిమినల్ చట్టాలు కాలానుగుణంగా నవీకరించబడ్డాయని అన్నారు.క్రిమినల్ చట్టాల సూక్ష్మ నైపుణ్యాలను మరియు సాంకేతిక పరిజ్ఞానం ఉన్న సమాజానికి వాటి ఆచరణాత్మక ఉపయోగం మరియు ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న నేరాల గురించి ఎస్పీ క్లుప్తంగా వివరించారు.తాజాగా సవరించిన చట్టాలను అమల్లోకి తీసుకురావడంలో పోలీస్ శాఖ పాత్ర చాలా కీలకమని అన్నారు.కొత్త చట్టాలలో పేర్కొన్న శిక్షలు,నిబంధనల పట్ల జిల్లా పోలీస్ శాఖలో పని చేసిన అధికారులు,సిబ్బంది అందరికీ ఈ చట్టాల పట్ల శిక్షణ పొందిన అధికారులతో జిల్లా వ్యాప్తంగా దశల వారీగా శిక్షణా తరగతులను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేశారు.క్రమశిక్షణతో ఈ శిక్షణా తరగతులను పూర్తిచేసుకుని చట్టాల పైన పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్,ట్రైనీ ఏఎస్పీ విక్రాంత్ సింగ్ ఐపిఎస్,డీసిఆర్బీ డిఎస్పీ మల్లయ్య స్వామీ,ఎస్బి ఇన్స్పెక్టర్ నాగరాజు,1టౌన్ సీఐ కరుణాకర్,2టౌన్ సీఐ రమేష్,3టౌన్ సీఐ శివ ప్రసాద్,ఎస్సైలు మరియు తరగతులకు హాజరైన సిబ్బంది పాల్గొన్నారు.