నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి రైతులతో సమావేశం లో
★జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
సిల్వర్ రాజేష్ (నేటి గదర్ ప్రతినిధి)మెదక్:
స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి గ్రామం రైతులతో సమావేశం నిర్వహించారు.
రెడ్డి పల్లి , గ్రామ వ్యవసాయ భూమి RRR లో పోతుందని దాని వల్ల గ్రామాల ప్రజలకు తీవ్ర నష్టం కలుగుతుందని , RRR యొక్క అలైన్మెంట్ మార్చాలని , పరిహారం పెంచాలని గ్రామ రైతులు కలెక్టర్ రాహుల్ రాజ్ దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ రెడ్డిపల్లి, సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని అన్నారు. అలైన్మెంట్ మార్చడం వీలు కాదని అయినప్పటికీ ప్రభుత్వం దృష్టికి విషయం తీసుకెళ్తానని , పరిహారం పెంపు విషయంలో అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు.
రైతులందరూ సమన్వయంతో ఉండాలన్నారు. పరిహారం పెంపు విషయంలో ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి, ఆవుల రాజి రెడ్డి, ఆంజనేయులు గౌడ్, సత్యనారాయణ గౌడ్ , మహేష్ గౌడ్, సత్యనారాయణ, నిరంజన్, నగేష్ గౌడ్, ప్రసాద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.