సిల్వర్ రాజేష్ (నేటి గదర్ ప్రతినిధి)మెదక్:
మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్.పి. డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్. ఆదేశానుసారం జిల్లా అదనపు ఎస్.పి అడ్మిన్ ఎస్.మహేందర్ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులకు పలు సూచనలు చేయడమైనది. ఈ కార్యక్రమంలో టేక్మాల్ మండలం పాల్వంచ గ్రామానికి చెందిన పులి మల్లేషం తన స్వంత భూమి అగు సర్వే 235/అ గల దానిలో పత్తి చేను వేసినాని మా గ్రామానికే చెందిన కొందరు వ్యక్తులు తేదీ:11.07.2024 నాడు అందాదా ఉదయం 08.30 గంటలకు ఎడ్ల గుంటుకతో మా పత్తి చేనును దున్ని వేసినారని అడిగితే నిన్ను నీ కుటుంబాన్ని చంపేస్తామని బెదిరిస్తున్నారని పత్తి చేను ద్వంసమ్ అయి లక్ష రూపాయల నష్టం అయిందని కావున మాకు నష్టం కలిగించి మమల్ని చంపుతామని బెదిరించిన వారి పై చట్టపరమైన చర్య తీసుకుని తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేయగా చట్టప్రకారం ఫిర్యాదికి తగిన న్యాయం చేయమని చిన్న అల్లాదుర్గ్ సి.ఐ కి సూచనలు చేయటం జరిగింది. అలాగే మెదక్ పట్టణానికి చెందిన మ్యాదరి రమ యాదగిరి అనే వ్యక్తి తేదీ:09.07.2024 నాడు గడ్డపారతో నా యొక్క ఇంటి తలుపులు పగలగొట్టి ఇంట్లో ఉన్న టీవిని పగలకొట్టాడని అడిగితే తన పై దాడికి వస్తున్నాడని కావున అతని పై చట్ట పరమైన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేయగా చట్టప్రకారం ఫిర్యాదికి తగిన న్యాయం చేయమని మెదక్ పట్టణ సి.ఐకి సూచనలు చేయటం జరిగింది.