★వన మహోత్సవం లో జిల్లా ప్రజలు భాగస్వామ్యం కావాలి
జిల్లా లో 34 లక్షల మొక్కలు నటడమే లక్ష్యం.
★ఇంటింటికి మొక్కల పంపిణీ చేయాలి .
చెట్లను నాటి పరిరక్షిస్తేనే – ప్రకృతిని రక్షించినట్లు.
భవిష్యత్ తరాల కోసం చెట్ల నాటాలి రక్షించాలి.
★సమీకృత కలెక్టర్ కార్యాలయ వన మహోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.
సిల్వర్ రాజేష్ (నేటి గదర్ ప్రతినిధి)మెదక్.
స్థానిక కలెక్టర్ కార్యాలయంలో సోమవారం వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మొక్కలు నాటారు .
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ వన మహోత్సవంలో మెదక్ జిల్లా ప్రజలు భాగస్వామ్యం కావాలన్నారు. జిల్లాలో 34 లక్షల మొక్కలు నాటేలా లక్ష్యంగా పెట్టుకున్నామని అందులో 15 లక్షల మొక్కలు నాటారని మిగిలిన మొక్కలు నాటే కార్యక్రమం కూడా కొనసాగుతుందన్నారు.
ఆవెన్యూ ప్లాంటేషన్ లో భాగంగా రోడ్డుకు ఇరువైపులా, ఇరిగేషన్ స్థలాలలో, చెరువులు, నదులలో, అటవీ భూములలో మొక్కలు నాటడానికి అనువైన స్థలాలు గుర్తించి మొక్కలు నాటే కార్యక్రమం కొనసాగిస్తున్నామన్నారు.
చెట్లను నాటడమే కాకుండా, వాటిని పరిరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలన్నారు.
భవిష్యత్ తరాల కోసం చెట్లనాటి వాటిని పరిరక్షిస్తే ప్రకృతిని పరిరక్షించినట్లుగా ఆయన పేర్కొన్నారు.
మన మహోత్సవ కార్యక్రమంలో జిల్లా ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలాన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జెడ్పి సీఈఓ ఎల్లయ్య, జిల్లా అటవీ అధికారి రవికుమార్, డి ఆర్ డి ఏ శ్రీనివాసరావు, అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.