+91 95819 05907

కాంగ్రెస్‌ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి..

బీఆర్ఎస్ పార్టీకి, మాజీ సీఎం కేసీఆర్ కు వరుసగా షాక్ లు తగులుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కారు దిగుతూ కాంగ్రెస్ బాటపడుతున్నారు. ఇప్పటికే 9 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. తాజాగా మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. పటాన్ చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హస్తం గూటికి చేరారు. సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు పార్టీ కుండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈయన రాకతో ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య పదికి చేరింది.

 

అయితే, పటాన్ చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరనున్నారంటూ నిన్నటివరకూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. కాగా, వాటికి చెక్ పెడుతూ డైరెక్టుగా ఆయన సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి.. కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆయనతోపాటు మరో బీఆర్ఎస్ నేత గాలి అనిల్ కుమార్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈయన ఇటీవలే జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో జహీరాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేశారు.

 

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో మహిపాల్ రెడ్డి, అనిల్ కుమార్ కు కాంగ్రెస్ కండువా కప్పి సీఎం రేవంత్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. వీరితోపాటు ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన పలువురు నేతలు కూడా హస్తం పార్టీలో చేరిపోయారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సొంత జిల్లా అయిన మెదక్ నుంచి కీలక నేతలు కాంగ్రెస్ లో చేరడం ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

 

మహిపాల్ రెడ్డి కంటే ముందు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ.. బీఆర్ఎస్ పార్టీని వీడి హస్తం గూటికి చేరుకున్నారు. వీరితోపాటు ఆరుగురు ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ కండువాను కప్పుకోవడం గమనార్హం.

 

ఈరోజుతో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 10కి చేరుకోగా, మరికొంతమంది ఎమ్మెల్యేలతో కూడా చర్చలు పూర్తయ్యాయని, వారు కూడా త్వరలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు కాంగ్రెస్ నేతలే బహిరంగంగా ప్రకటన చేస్తున్న విషయం తెలిసిందే.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

చింతకానిలో ఘనంగా కట్ట మైసమ్మ తల్లి మొక్కులు చెల్లించుకున్న ముదిరాజులు.

చింతకానిలో ఘనంగా కట్ట మైసమ్మ తల్లి మొక్కులు చెల్లించుకున్న ముదిరాజులు. నేటి గదర్ న్యూస్ చింతకాని ప్రతినిధి : ఉమ్మడి ఖమ్మం జిల్లా చింతకాని మండల పరిధిలోని స్థానిక నల్లచెరువుపై కొలువుతీరి ఉన్న కట్టమైసమ్మ

Read More »

తెలంగాణ రాష్ట్రంలో దుబారా మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ

ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. బిజెపి మండల అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి డిమాండ్. నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మార్చి 17. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో బిజెపి

Read More »

మాసాయిపేట రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం

** పాల్గొన్న పలు గ్రామాల రైతులు నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మార్చి 17. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో మంగళవారం నాడు మాసాయిపేటలో గల రైతు వేదిక

Read More »

సర్పంచ్ ల సంఘం నూతన అధ్యక్షులుగా సోలం కేశవరావు.

నేటి గదర్‌ కరకగూడెం: కరకగూడెం మండలం సర్పంచుల సంఘం నూతన అధ్యక్షులుగా వెంకటాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ సోలం కేశవరావు, ఉపాధ్యక్షులుగా కన్నాయిగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ కల్తీ. విజయ్ కుమార్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ

Read More »

విద్యార్థుల అభివృద్ధికి ఆత్మ బలమే ఆలంబన.

*డాక్టర్ ఎస్ సారంగపాణి విశ్రాంత ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్* *డాక్టర్ సారంగాపాని సేవలు అభినందనీయం మండల విద్యాశాఖ అధికారి గడ్డం.మంజుల* *పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్ మరియు షూ పంపిణీ* నేటి గదర్

Read More »

ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు తుంగలో తొక్కుతున్న సీఎం

. *పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం* *జీతాలు పెంచంటే అరెస్టులు చేస్తారా?* నేటి గదర్‌ కరకగూడెం: అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు తాము అధికారంలోకి వస్తే వేతనాలు పెంచుతామని 26 వేల రూపాయలు జీతం ఇస్తామని

Read More »

 Don't Miss this News !