నేటి గద్దర్ న్యూస్, గుండాల;సత్యశోధక్ సమాజ్ స్ఫూర్తితో కులమత రహిత సమాజాన్ని నిర్మిద్దామని పి డి ఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇర్ఫ రాజేష్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా పూలే స్థాపించిన సత్య బోధకు సమాజ్ 152వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కుల పీడ నాకు, కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించాలని కులమత బేధాలు లేకుండా ప్రజలంతా సమానత్వంతో జీవించే విధంగా విద్యార్థి లోకం స్ఫూర్తి నింపాలని అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కులం మతం పేరుతో ద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుతుందని అన్నారు. రైతు కార్మిక కర్షక వ్యతిరేక విధానాలతో కార్మిక లోకానికి తీవ్ర అన్యాయాన్ని కేంద్ర ప్రభుత్వం చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో గూగుల్ తు భాస్కర్, సిద్ధార్థ, సందీప్, నితిన్, తదితరులు పాల్గొన్నారు