నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి.
ఖమ్మం : ఉన్నత చదువులు చదువు ఆర్థిక స్తోమత లేని పేద విద్యార్థులకు గత 10 సం ఆసరా గా నిలుస్తూ ఆర్థిక సహాయం చేస్తున్న పే బ్యాక్ టు సొసైటీ – ప్రమోటింగ్ ఎడ్యుకేషన్ 5 వ సం. ర క్యాలండర్ ని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట్ స్వామి , తెలంగాణా ఎంప్లాయిస్ అసోసియేషన్ అఫ్ మాల రాష్ట్ర ఫౌండర్ అధ్యక్షులు , రిటైర్డ్ ఐ పి ఎస్ , వర్ధన్నపేట ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజ్ లు ఆవిష్కరించారు . ఈ కార్యక్రమ్మాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యేలు వివేక్ , నాగరాజ్ లు మాట్లాడుతూ భారతరత్న డా బి ఆర్ అంబేద్కర్ రిజర్వేషన్స్ పలాలు అనుభవించిన వారు వచ్చిన సమాజానికి సహాయ సహకారాలు అందిస్తూ వాటిలో ముఖ్యంగా మన సమాజములోని పేదల విద్యకు ఆసరాగా నిలవాలని కోరినారు . ఈ యొక్క కార్యక్రమంలో పే బ్యాక్ టు సొసైటీ వ్యవస్థాపకులు జంగం లక్ష్మణరావు , సొసైటీ బాద్యులు డా ఎమ్ ఫ్ గోపినాథ్ , జాతీయ మాలల అధ్యక్షులు జి. చెన్నయ్య , పల్లా రాజశేఖర్ , జమ్మి జైపాల్ , చీహేచ్ కనకయ్య , డి ప్రతాప్ , బి ప్రవీణ్ , ఐ ఎమ్ జె ఏ జర్నలిస్తుల బాద్యులు నుండి పప్పుల వేణు , బాబురావు , యు రమేష్ , జి సాయిబాబు , కే దిలీప్ , ఎర్రా రమేష్ , వి మోహన్ , యు జగన్ , ఐ ఎమ్ ఎల్ ఏ లాయర్ల సంగం బాద్యులు మర్రి ప్రకాష్ , వరద నరసింహారావు , పూర్వ పబ్లిక్ ప్రొసీక్యూయెటర్ తలమల హస్సేన్ , లింగాల రవికుమార్ , ప్రభాకర్ , జి కృష్ణ , నర్సింహారావు , రమేష్ , ఎమ్ ప్రకాష్ , భాస్కర్ తదితరులు పాల్గొన్నారు .