*హోరాహోరీగా సాగినపోలీస్ పాత్రికేయుల క్రికెట్ మ్యాచ్*
*మూడు మ్యాచ్ల సిరీస్లో రెండు ఒకటి తో కప్ గెలుచుకున్న పోలీస్ టీం*
*నేటి గద్దర్ న్యూస్ గుండాల*,గుండాల మండల కేంద్రం శనివారం గుండాల పోలీస్ శాఖ పాత్రికేయులు స్నేహపూర్వక మూడు మ్యాచ్ల సిరీస్ నిర్వహించారు. ఈ మ్యాచ్లను ఎరుజట్లు హోరాహోరీగా తలపడి గెలుపు కోసం ముమ్మర ప్రయత్నాలు చేశారు. రెండు ఒకటి తేడాతో పోలీస్ టీం కప్పును కైవసం చేసుకోగా రన్నరపుగా పాత్రికేయుల టీం నిలిచింది. కుండాల సీఐ ఎల్ రవీందర్ కృషితో వ్యాపారస్తులు మానాల వెంకటేశ్వర్లు, పట్వారి వెంకన్న, మాడె మంగయ్య సహకారంతో పోలీస్ ,జర్నలిస్టుల మధ్య ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. గుండాల సీఐ రవీందర్ వారి సిబ్బందితో కలిసి టీంకు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఉల్లాసం పెంపొందుతుందని నిత్యం బిజీగా ఉండే పోలీసులు, జర్నలిస్టులు ఆహ్లాదకరంగా గడిపినట్లు తెలిపారు. జర్నలిస్టులు పోలీసుల మధ్య మంచి కోఆర్డినేషన్ ఉండడానికి ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం జరిగిందని అన్నారు. అనంతరం గెలుపొందిన రెండు జట్లకు వ్యాపారవేత్త మానాల వెంకటేశ్వర్లు షీల్డ్ లను అందజేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, జర్నలిస్టులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు