పినపాక
లక్ష డప్పులు, వేల గొంతుకలు కార్యక్రమంలో భాగంగా ఈ నెల 7న జరిగే ఛలో హైదరాబాద్ ను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు వెంకటేశ్వర్లు మాదిగ పిలుపునిచ్చారు.. ఆదివారం పినపాక మండలం ఎల్చిరెడ్డిపల్లి గ్రామంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో లక్షల డప్పులు వేల గొంతులు చలో బహిరంగ సభను విజయవంతం చేయడానికి కోసం
మాదిగల భారీ సంస్కృతిక ప్రదర్శన పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు వల్లే పోగు వెంకటేశ్వర్లు మాదిగ హాజరై హైదరాబాదులో ఫిబ్రవరి 7న జరగబోయే భారీ ప్రదర్శన పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్సీ,ఏ బి సి డి వర్గీకరణకై మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాల శాంతియుత పోరాటంలో విజయం సాధిస్తాడని దానికి మండల మాదిగ దండోరా మాదిగ జాతి బిడ్డలు ప్రతి ఊరు నుంచి ప్రతి ఇంటి నుండి డప్పు చేత పట్టుకొని ఫిబ్రవరి 7 తారీఖున హైదరాబాద్ రావలసిందిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు .ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో నాయకులు వల్లేపోగు రాము, కొప్పుల కళ్యాణం, విస్సంపల్లి సాంబశివరావు, కొప్పుల సాగరు, కొప్పుల సంపత్, కొప్పుల వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు