-నివాళులర్పించిన సిపిఎం శ్రేణులు
-ఆయన మృతి పార్టీకి తీరని లోటున్న సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న
పినపాక
మండల పరిధిలోని అమరారం గ్రామానికి చెందిన సిపిఎం మండల కమిటీ సభ్యులు తోలేం పరమయ్య అనారోగ్యంతో ఆదివారం ఉదయం మృతి చెందారు. ఈ విషయం గురించి తెలుసుకున్న సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జిల్లా నిమ్మల వెంకన్న భౌతికకాయాన్ని సందర్శించారు. పరమయ్య భౌతిక కాయంపై సిపిఎం జెండా కప్పి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. పరమయ్య మృతి సిపిఎంకు, ప్రజా పోరాటాలకు తీరని లోటని పలువురు పేరొన్నారు. ప్రజాపోరాటాల్లో చురుకైన పాత్ర పోషించారన్నారు.కూలీ పోరాటాలు, భూ పోరాటాలు ,కౌలు రైతుల సమస్యలపై అలుపెరగని పోరాటం చేశారన్నారు. తద్వార ప్రజల్లో మంచి గుర్తింపు పొందారన్నారు. అనేక పోరాటాలు నిర్వహించి ప్రజల మన్నలు పొందిన ప్రసాద్ మరణించటడం బాధాకరమని, వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు . నివాళులు అర్పించిన వారిలో సిపిఎం మండల కార్యదర్శి దుబ్బా గోవర్ధన్, కార్యదర్శి వర్గ సభ్యులు మడివి రమేష్, మండల కమిటీ సభ్యులు నట్టి శంకరయ్య, కల్తి వెంకటేశ్వర్లు, కల్తి నాగేశ్వరరావు, పాయ శంకర్, తదితరులు ఉన్నారు.