నేటి గదర్ న్యూస్ :వైరా నియోజకవర్గ ప్రతినిధి
కారేపల్లి :రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,ఇందిరమ్మ ఇండ్లు సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతివొక్కరికి అమలు చేయాలని సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం డిమాండ్ చేశారు.
సోమవారం సిపిఎం సింగరేణి మండల కమిటీ సమావేశం బాణోత్ బ్యాన్సిలాల్ అధ్యక్షతన జరగగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలను అందరికీ ఇచ్చినట్లుగా గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి గతంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు రుణమాఫీ,500 గ్యాస్ సిలిండర్లు పథకంలలో అర్హులైన వారికి రాలేదని విమర్శలు,ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని,ప్రస్తుతం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక వివాదాస్పదంగా వుందని,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కు పెట్టిన నిభందనలు కారణంగా అర్హులైన వారు నష్టపోతున్నారని,రైతుభరోసా అమలు విషయంలో తేదీల మార్పు,ఇచ్చే సహాయం కుదింపు రాష్ట్ర ప్రభుత్వ చిత్త శుద్దిని ప్రశ్నించవలసి వస్తున్నదని విమర్శించారు. ఆర్ గ్యారంటీలను సంక్షేమ పథకాలను అర్హులైన వారందరికీ అమలు చేయాలని లేని యెడల ప్రజలను కదిలించి పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ సమావేశం లో పార్టీ జిల్లాకమిటి సభ్యులు కొండబోయిన నాగేశ్వరరావు,మండల కార్యదర్శి కే నరేంద్ర,డివిజన్ కమిటీ సభ్యులు వజ్జా రామారావు, మండల కమిటీ సభ్యులు పండగ కొండయ్య,సూరభాక దానమ్మ,Y రవి,k ఉపేందర్,G వెంకటేశ్వర్లు,అజ్మీరా,శోభన్,భూక్యా. లక్ష్మణ్, ముండ్ల యాకాంబరం, అన్నారపు కృష్ణ బానోతు కిషన్, దాసరి సైదులు తదితరులు పాల్గొన్నారు.