+91 95819 05907

క్షయ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి :డాక్టర్ శృతి

క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంలో నిర్వహిస్తున్న 100 రోజుల ముమ్మర కృషి కార్యక్రమం *నిక్షయ్ షివిర్* లో భాగంగా జానం పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ శృతి ఆధ్వర్యంలో ఆయుష్మాన్ ఆరోగ్యం మందిర్ జానంపేట గ్రామాల ప్రజలకు క్షయ వ్యాధి పై అవగాహన, అనుమానితుల గుర్తింపు జరిగింది.దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన క్షయ వ్యాధి తీవ్రంగా ఉన్న 347 జిల్లాల్లో తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది జిల్లాలు ఉన్నాయని అందులో మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఒకటి అని కాబట్టి క్షయ వ్యాధిపై సమాజంలోని ప్రతి ఒక్కరూ చర్చించుకుని అవగాహన పెంచుకొని దానిని పూర్తిగా నిర్మూలించడంలో సహకరించాలని ఈ సందర్భంగా కోరారు లేనిచో క్షయ వ్యాధి బారిన పడి మరణం పొందిన జాబితాలో మనతోపాటు మన కుటుంబ సభ్యులు కూడా ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తూ వ్యాధి లక్షణాలు అయినా 15 రోజులకు మించి దగ్గు, జ్వరం ఆకలి లేకపోవడం బరువు తగ్గిపోవడం, ఆయాసం, అలసట, తేమడా లో రక్తం పడటం , మెడ చుట్టూ, సంకలో, గజ్జ లో గడ్డలు వంటి ప్రధాన లక్షణాలు ఉన్నవారు గతంలో క్షయ వ్యాధికి మందుల వాడిన వారు మరియు వారి కుటుంబ సభ్యులు దీర్ఘకాలిక వ్యాధులకు మందులు వాడుతున్న వారు, 60 సంవత్సరాలు పైబడిన వారు ఈ వందరోజుల నిక్షయ్ షివిర్ కార్యక్రమంలో పాల్గొని ఉచిత క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకుని నిర్ధారణ జరిగితే ప్రభుత్వం ఇచ్చే నాణ్యమైన మందులతో వ్యాధిని తగ్గించుకొని తద్వారా మరణాన్ని నివారించుకోవడంతోపాటు కుటుంబ సభ్యులకు మరియు సమాజంలోని ఇతరులకు క్షయ వ్యాధి వ్యాప్తిని నివారించవచ్చని తద్వారా ఈ వ్యాప్తిని భారత సమాజం నుంచి పూర్తిగా నిర్మూలించడం సాధ్యపడుతుందని అన్నారు అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో క్షయ వ్యాధికి మందులు వాడే ప్రతి వ్యాధిగ్రస్తుడికి వ్యాధి తగ్గేవరకు నిరంతర సూచనలు సలహాలు ఇవ్వడంతో పాటు పోషకాహార నిమిత్తం మందులు వాడే కాలానికి ప్రతి నెల 1000 రూపాయలు ఎకౌంట్ లో వేయడం జరుగుతుంది అని తెలిపారు ఈ కార్యక్రమంలో ANM’S అశాస్ మరియు NTEP KEY స్టాఫ్ పాల్గొన్నారు. ధన్య వాదాలు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

అన్న మాట ప్రకారం.. 15 రోజుల్లోనే!* డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మలతో కలిసి వెలుగుమట్ల నిర్వాసితులకు పట్టాల పంపిణీ చేసిన మంత్రి పొంగులేటి

అన్న మాట ప్రకారం.. 15 రోజుల్లోనే!* డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మలతో కలిసి వెలుగుమట్ల నిర్వాసితులకు పట్టాల పంపిణీ చేసిన మంత్రి పొంగులేటి ‘కబోదుల’ పాలనలో పేదోడి ఘోష.. ‘ఇందిరమ్మ’ రాజ్యంలో పట్టాల

Read More »

ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు… మంచిదే అలాగే కేసులు ఎత్తివేయండి భూదాన భూములపై శ్వేత పత్రం ప్రకటించండి

ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు… మంచిదే అలాగే కేసులు ఎత్తివేయండి భూదాన భూములపై శ్వేత పత్రం ప్రకటించండి మిగతా లబ్ధిదారులకు కూడా ఇక్కడే ఇల్లు నిర్మించి ఇవ్వండి ____ ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర

Read More »

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక అంతా పచ్చి అబద్ధం: బిఆర్ఎస్ నాయుకులు నారం రాజశేఖర్

​పాత దరఖాస్తులకే దిక్కులేదు.. మళ్ళీ కొత్త నాటకాలా? కాంగ్రెస్ తీరుపై బీఆర్ఎస్ యువజన విభాగం ఆగ్రహం నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 10: అశ్వారావుపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ

Read More »

ప్రజా బలం లేని అతికొద్దిమందితో సాయుధ పోరాటం ద్వారా అంతిమ లక్ష్యం సాధ్యం కాదు:సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు

ప్రజా బలం లేని అతికొద్దిమందితో సాయుధ పోరాటం ద్వారా అంతిమ లక్ష్యం సాధ్యం కాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు అన్నారు. కమ్యూనిస్టులంతా కోరుకుంటున్న సమ సమాజాన్ని ప్రజాసామ్యబద్దంగా సాధించుకుందామని,ఇందుకు కలిసి

Read More »

మెదక్ జిల్లాలో శిశు విక్రయం

రూ.1.7 లక్షలకు కన్న కొడుకును అమ్ముకున్న తల్లిదండ్రులు మెదక్ జిల్లా హవేలీఘనాపూర్ మండలం లింగసానిపల్లి తండాలో గత నెల 10వ తేదీన మగశిశువుకు జన్మనిచ్చిన ఓ గిరిజన మహిళ అంగన్వాడీ కేంద్రం నుండి గుడ్లు,

Read More »

రూ.66 లక్షల ఇన్సూరెన్స్ కోసం భర్త ను కారుతో గుద్దించి హత్య చేసిన భార్య

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో ఢీకొట్టించి చంపిన భార్య ఖమ్మం పట్టణం గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు చాగంటి రవి, ప్రశాంతి వీరికి 20 ఏళ్ల క్రితం వివాహం

Read More »

 Don't Miss this News !