రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) ఫిబ్రవరి 11:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు సలావుద్దీన్ సోమవారం నాడు తోనిగండ్ల గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై మృతి చెందాడు.కాగా మంగళవారం నాడు కాట్రియాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మృతుడు సలావుద్దీన్ చిత్రపటానికి విద్యార్థులు,ఉపాధ్యాయులు,స్థానిక ప్రజా ప్రతినిధులు విద్యార్థుల తల్లిదండ్రులు ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా రెండు నిమిషాల పాటు పాఠశాల ఆవరణలో విద్యార్థులు ఉపాధ్యాయులు మౌనం పాటించారు.ఉపాధ్యాయుడు మృతితో పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు ఉపాధ్యాయులు రోదనలతో మిన్నంటాయి.తమకు విద్యాబోధన చేసి ఇంటికి వెళ్తున్న ఉపాధ్యాయుడు అకాల మరణం చెందడం పై విద్యార్థులు భావోద్వేగానికి లోనై కన్నీరు మున్నీరుగా విలపించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు,విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
