★యువత క్రీడల్లో రాణించాలి :ఎస్ఐ రాజ్ కుమార్
పినపాక
యువత క్రీడల్లో రాణించాలని ఈ బయ్యారం ఎస్సై రాజ్ కుమార్ సూచించారు. మంగళవారం పినపాక మండల పరిధిలోని తిర్లాపురం వలస ఆదివాసి గ్రామాన్ని ఆయన సందర్శించారు. అక్కడ యువతకు వాలీబాల్ కిట్లను పంపిణీ చేశారు. మారుమూల గ్రామాల్లో యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు. పోలీస్ శాఖ సహకారం ఎల్లవేళలా ఉంటుందని తెలిపారు. యువత అసాంఘిక చర్యలకు దూరంగా ఉండాలని, అసాంఘిక శక్తులకు సహకరించవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Post Views: 89