రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) ఫిబ్రవరి 11:- మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో 16 గ్రామపంచాయతీలు ఉండగా అందులో జడ్పీటీసీ మరియు ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ స్టేషన్ల వారిగా పలు గ్రామపంచాయతీలకు ఎంపీటీసీల జాబితాను మంగళవారం నాడు మండల ఎంపీడీవో సాజీనోద్దీన్ విడుదల చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జడ్పీటీసీ మరియు ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి 40 పోలింగ్ స్టేషన్ లు ఏర్పాటు చేశామని అయన తెలిపారు.ఇందులో పురుషులు ఓటర్లు 9350 స్త్రీలు ఓటర్లు 10355 మొత్తం ఓటర్ల సంఖ్య 19705 ఉన్నట్లు అయన పేర్కొన్నారు.ఈ ఎన్నికలకు సంబంధించి వివిధ గ్రామాల్లో జరుగునున్న పోలింగ్ కు అధికారులు సమాయత్తం అవుతున్నట్లు ఆయన వెల్లడించారు.
Post Views: 145









