రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) ఫిబ్రవరి 11:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా డిఎంహెచ్ఓ శ్రీరామ్ సందర్శించారు.ఆసుపత్రి డాక్టర్లతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాయంపేట మండల పరిధిలోని గ్రామాలలో ఎవరికైనా టీబి లక్షణాలు ఉండి ఉన్నట్లయితే వారి శాంపిల్స్ ని ఉన్నత వైద్యధికారులకు పంపి వారికి మందులను పంపిణీ చేస్తామన్నారు.అదేవిధంగా గ్రామాలలో ఎవరికైనా శరీరంపై మచ్చలు ఉండి మొద్దు బారినట్లు ఉన్నట్లయితే కుష్టు వ్యాధిగా గుర్తించి వారికి తగిన పరీక్షలు చేసి మందులను పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.బీపీ షుగర్ లాంటి వ్యాధిగ్రస్తులకు తగిన మందులు కూడా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.త్వరలో గ్రామాలలో క్యాంపులను ఏర్పాటు చేసి టీబి మరియు కుష్టు వ్యాధిని నిర్మూలించే దిశగా డాక్టర్లు అవగాహన కల్పిస్తారని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ నవీన్, మండల వైద్యాధికారి డాక్టర్ హరిప్రియ, కొండయ్య,హెచ్ఈఓ రామారావు,పిహెచ్ఎన్ రాణి మనోహర,సూపర్వైజర్లు,ఏఎన్ఎంలు,ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.









