హావేళ్ళి ఘణపూర్ మండలం మెదక్ రూరల్ నేటి గదర్ ప్రతినిధి ఫిబ్రవరి 12.
మెదక్ జిల్లా హవేళ్ళి ఘణపూర్ మండలం సర్ధన గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్ రాజేశ్వరరావు తండ్రి సర్వోత్తమ్ రావు ఇటీవల మృతి చెందాడు. బుధవారం రోజు సర్వోత్తమ్ రావు దశదిన కర్మ కార్యక్రమానికి హాజరై వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ శాసనసభ్యురాలు యం. పద్మ దేవేందర్ రెడ్డి . వీరి వెంట బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు యం. దేవేందర్ రెడ్డి, తాజా మాజీ జిల్లా పరిషత్ అధ్యక్షురాలు యం. లావణ్య రెడ్డి,హవెలిఘనపూర్ మండల పార్టీ అధ్యక్షులు. సిహెచ్. శ్రీనివాస్ రెడ్డి, తాజా మాజీ వైస్. ఎంపీపీ రాధాకృష్ణ యాదవ్, నాయకులు సతీష్ రావు, సత్యవర్ధన్ రావు,మ్యాకల. సాయిలు, రామచంద్ర రెడ్డి, నరేందర్ రెడ్డి, సాప. సాయిలు, వినయ్,రంజిత్, లడ్డు నాయక్ తదితరులు ఉన్నారు.